సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్.. అదిరిపోయింది

ABN, Publish Date - Jul 18 , 2026 | 10:11 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)కి ప్రస్తుతం ఒక మంచి హిట్ చాలా అవసరం. గతేడాది ఆంధ్రాకింగ్ తాలూకా సినిమాతో వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.

RAPO23

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)కి ప్రస్తుతం ఒక మంచి హిట్ చాలా అవసరం. గతేడాది ఆంధ్రాకింగ్ తాలూకా సినిమాతో వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక దీంతో రామ్ హిట్ కోసం తానే రంగంలోకి దిగాడు. రామ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా,భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం రాపో23. రామ్ కేవలం హీరోగా నటించడమే కాకుండా, తానే స్వయంగా కథను అందిస్తూ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్లింది.


ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ లెజెండరీ నటుడు జాకీ ష్రాఫ్‌తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. కథలోని ఇంటెన్స్ ఘర్షణకు జాకీష్రాఫ్ యొక్క పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా సెట్ అవుతుందని, సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని మేకర్స్ భావించడంతో జాకీష్రాఫ్ ని కలిసినట్లు సమాచారం. ఇక కథ విన్నాక ఆయన కూడా ఓకే అన్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. రామ్ - జాకీష్రాఫ్ ల మధ్య యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.


ఒక వైవిధ్యమైన నియో-నాయిర్ బ్యాక్‌డ్రాప్‌తో, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, ఎమోషనల్ లేయర్స్ ఉన్న పక్కా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ కథను రాసుకున్నాడట రామ్. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఇండియాలోనే టాప్-నోచ్ టెక్నికల్ క్రూ రంగంలోకి దిగింది. ఇక ఇప్పుడు జాకీష్రాఫ్ కూడా యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. . ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. మరి ఈ సినిమాతోనైనా రామ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. ? లేదా అనేది చూడాలి.

Updated Date - Jul 18 , 2026 | 10:13 PM