సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jabardasth Shanthi Swaroop: అమ్మాయిలు చెడిపోయారు.. అవకాశాల కోసం పడుకుంటున్నారు

ABN, Publish Date - Aug 14 , 2026 | 09:53 PM

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడుశాంతి స్వరూప్.

Shanthi Swaroop

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడుశాంతి స్వరూప్ (Shanthi Swaroop). లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులకు నవ్వులు పంచే అతను, టీవీ స్క్రీన్‌పై ఎంత నవ్వుతూ కనిపిస్తారో.. అతను వ్యక్తిగత జీవితం వెనుక అంతటి కన్నీటి గాథ దాగి ఉంది. ఇటీవల ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న శాంతి స్వరూప్, తన జీవితంలో ఎదుర్కొన్న దుర్భరమైన పరిస్థితులు, ఎదురైన విమర్శల గురించి పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.


ఇండస్ట్రీకి రాకముందు తగిన నివాసం, కనీసం తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపిన శాంతి స్వరూప్ గుడులు, చర్చిలలో ఇచ్చే ప్రసాదాలు తింటూ, షాపుల ముందున్న అరుగులపై నిద్రించిన రోజులు ఉన్నాయని గుర్తుచేసుకున్నాడు. 2007లో తండ్రి మరణించినప్పుడు కనీసం చివరి చూపు, అంత్యక్రియలు నిర్వహించడానికి ఐదుగురు అన్నదమ్ముల వద్ద రూ. 2000 కూడా లేవని, అప్పులు అడిగి ఆ కార్యక్రమాలు చేశానని కన్నీటిపర్యంతమయ్యాడు. కుటుంబ బాధ్యతలు, తల్లిని పోషించుకోవడం కోసమే తాను ఈ విగ్గు పెట్టుకుని, చీరలు కట్టుకుని లేడీ గెటప్స్ వేస్తున్నానని, దీనివల్ల ఎవరికీ హాని చేయడం లేదని స్పష్టం చేశాడు.


ఇదే సమయంలో సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై, కాస్టింగ్ కౌచ్‌పై కూడా అతను ఓపెన్‌గా మాట్లాడాడు. షార్ట్ టైమ్‌లోనే ఫేమ్, డబ్బులు సంపాదించాలని కొంతమంది ఆరాటపడుతున్నారని.. చాలామంది అమ్మాయిలు అవకాశం ఇస్తారా.. కావాలంటే పడుకుంటాం అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న అమ్మాయిలు చెడిపోయారు.. శని, ఆదివారాలు పార్కుల్లో చుస్తే పొదల్లో జంటలే కనిపిస్తాయి. అవకాశాల కోసం కాంప్రమైజ్ కావడం సరైన పద్ధతి కాదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తనకు అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లేవారు కూడా లేరని, స్వయంగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మళ్లీ అలాంటి కష్టాలు జీవితంలో రాకూడదని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Aug 14 , 2026 | 10:02 PM