Jabardasth Rohini: ఇతనే నా బాయ్ ఫ్రెండ్.. చివరికి రోహిణి కూడా అదే పని చేసిందే
ABN, Publish Date - Jan 11 , 2026 | 03:15 PM
లేడీ కమెడియన్ రోహిణి (Rohini) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మావా.. అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే కామెడీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Jabardasth Rohini: లేడీ కమెడియన్ రోహిణి (Rohini) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మావా.. అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే కామెడీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత జబర్దస్త్, కామెడీ షోస్ లలో కనిపిస్తూ బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక ఆ గుర్తింపుతో వరుస సినిమాల్లో కూడా కనిపిస్తూ మెప్పిస్తుంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ రోహిణికి చాలా మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది.
తన బరువు వలన షోస్ లలో కామెడీ చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ నవ్విస్తూ ఉంటుంది. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న రోహిణి.. తనకు కూడా బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసి అబ్బా.. అబ్బాయి చాలా బావున్నాడు. రోహిణి చాలా అదృష్టవంతురాలు.. కంగ్రాట్స్ అని కామెంట్ చేసే ముందు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా చదివితే మొదట షాక్ అవుతారు.. ఆ తరువాత సర్ ప్రైజ్ అవుతారు. అదేంటి.. ఎందుకు అంటే.. అతను నిజంగా మనిషి కాదు.. చాట్ జీపీటీ మాయ.
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ద్వారా ఏదైనా సాధ్యం చేసేస్తున్నారు. అలానే సింగిల్ గా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు తమకు కాబోయే భర్తలు, భార్యలు ఎలా ఉండాలనుకుంటున్నారో.. చాట్ జీపీటీకి చెప్తే చాలు.. మీ ఫోటో పక్కన అందమైన అమ్మాయి, అబ్బాయి ఫోటోను యాడ్ చేసి పంపిస్తుంది. నిజంగా ఆ ఫోటో చూస్తే అది ఎడిట్ అని చెప్పడం ఎవరివలన కాదు. రోహిణి కూడా తన పక్కన ఉన్న అబ్బాయి చాట్ జీపీటీ పంపింది అని చెప్పకపోతే నిజంగా అతడి గురించి ఆరాలు తీయడం కూడా మొదలుపెట్టేవారు. 'ఫైనల్లీ.. ఇతడే నా మనిషి. చాట్ జీపీటీ పంపింది. థాంక్యూ.. మంచి అందగాడిని పంపావు' అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటో చూసిన సింగిల్స్ చివరికి నువ్వు కూడా ఈ ట్రెండ్ లో చేరిపోయావా రోహిణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.