ఫైనల్లీ.. ప్రవీణ్ ని పెళ్లాడిన ఫైమా
ABN, Publish Date - Jun 24 , 2026 | 09:15 PM
పటాస్, జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా (Faima). ఈ గుర్తింపుతో ఆమె బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
పటాస్, జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా (Faima). ఈ గుర్తింపుతో ఆమె బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఫైమా కామెడీని పక్కన పెడితే.. ముగ్గురు కుర్రాళ్లను ప్రేమ పేరుతో మోసం చేసిందన్న వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో సేన్సేషన్ గా మారాయి. అందులో కమెడియన్ ప్రవీణ్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ జబర్దస్త్ లో పెయిర్ గా నటించి మెప్పించారు. ఆ తరువాత స్టేజిమీదనే ప్రవీణ్.. ఫైమాకి ప్రపోజ్ చేయడం, ఆమె ఓకే చెప్పడం కూడా జరిగింది. బిగ్ బాస్ కి ఫైమా వెళ్ళేవరకు ఉన్న వీరి రిలేషన్.. ఆమె హౌస్ నుంచి వచ్చాక లేదు. కొన్ని కారణాల వలన తాము విడిపోయామని ఫైమా చెప్పగా.. ప్రవీణ్ మాత్రం తనను మోసం చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రవీణ్.. ఫైమాని మరిచి ఈమధ్యనే పెళ్లి పీటలు ఎక్కాడు. ఇక ఇప్పుడు ఫైమా కూడా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. ప్రవీణ్ తో ప్రేమాయణం తరువాత ప్రవీణ్ నాయక్ తో ఫైమా రిలేషన్ లో ఉంది. ఇక తాజాగా అతనితోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాద్‌లోని ఒక రిజిస్టర్ ఆఫీస్‌లో అత్యంత నిరాడంబరంగా ఈ లవ్ మ్యారేజ్ జరిగింది.దాదాపు తొమ్మిదేళ్లుగా సాగుతున్న వీరి సీక్రెట్ లవ్ స్టోరీకి ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ ఎదిరించి ఈ జంట ఒకటయ్యారు.
పెళ్లి తర్వాత రిజిస్టర్ ఆఫీస్ నుండి ఫోటోలు, వీడియో షేర్ చేస్తూ.. ఫైమా ఎమోషనల్ అయ్యింది. "వాళ్లు మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని జడ్జ్ చేశారు. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించారు. కానీ ప్రతి అడ్డంకి కంటే మా ప్రేమే చాలా బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు.. అంతులేని సహనం. ఒకరినొకరు వదిలేయడానికి వేయి కారణాలు ఉన్నా.. మేము మాత్రం ప్రతిరోజూ ఒకరినొకరే ఎంచుకున్నాం. ఈ రోజు.. మేము భార్యాభర్తలం' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త జంటకు అభిమానులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.