Jabardasth Comedian: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు మృతి
ABN, Publish Date - Feb 04 , 2026 | 04:33 PM
బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. జబర్దస్త్ (Jabardasth), సుమ అడ్డా లాంటి కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ (Bobby) అలియాస్ లక్ష్మీ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించాడు
Jabardasth Comedian: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. జబర్దస్త్ (Jabardasth), సుమ అడ్డా లాంటి కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ (Bobby) అలియాస్ లక్ష్మీ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం రాత్రి రాజమండ్రి రోడ్డు–రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాబీ తలకు తీవ్రగాయాల పాలై అక్కడిక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఎదురుగా వచ్చిన వాహనంపై ఉన్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు మరణించారు. హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇంత దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
బాబీ మరణవార్త తెలుసుకున్న యాంకర్ సుమ.. అతని ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించింది. కొంతమంది జబర్దస్త్ నటులు.. సోషల్ మీడియా ద్వారా బాబీకి నివాళులు అర్పించారు. బాబీ.. మాజీ ఎంపీ హర్ష కుమార్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. అనంతరం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమ అడ్డా లాంటి షోస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సీరియల్స్ లో కూడా బాబీ నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాబీ ఇలా రోడ్డుప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని జబర్దస్త్ నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.