సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Itlu Arjuna: ఒకే వేదికపై.. మెగా, అక్కినేని హీరోలు

ABN, Publish Date - Nov 09 , 2026 | 07:12 PM

నాగార్జున సమర్పణలో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ఇట్లు అర్జున మ్యూజికల్ కాన్సర్ట్‌కు రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ హాజరుకానున్నారు.

Itlu Arjuna

కింగ్ నాగార్జున సమర్పణలో అనీష్ (Anish), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా నటిస్తున్న చిత్రం ఇట్లు అర్జున (Itlu Arjuna). మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ రోజు మ్యూజికల్ కన్సర్ట్ (Musical Concert) జరగనుంది.

కాగా ఈ వెంట్‌కు అక్కినేని నాగార్జు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan), అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హాజరు కానున్నారు. ఈ విషయాన్ని థమస్ సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించారు. కింగ్ నాగార్జున ( Nagarjuna) సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు.

ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Updated Date - Nov 09 , 2026 | 07:17 PM