సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వారం క్రితమే.. జాన‌క‌మ్మ నేను మాట్లాడుకున్నాం! ఆ మాటలే చివరివయ్యాయి.. కన్నీరు మున్నీరైన అభిమాని

ABN, Publish Date - Jul 16 , 2026 | 04:41 PM

ప్రముఖ దిగ్గజ గాయని జానకమ్మ (S Janaki) మరణం సంగీత ప్రపంచానికే కాకుండా కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు మిగిల్చింది.

S Janaki

ప్రముఖ దిగ్గజ గాయని జానకమ్మ (S Janaki) మరణం సంగీత ప్రపంచానికే కాకుండా కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు మిగిల్చింది. జానకమ్మ అంటే కేవలం ఒక లెజెండరీ సింగర్ మాత్రమే కాదు.. అభిమానులను కన్నబిడ్డల్లా చూసుకునే అమృతమూర్తి అని కన్నీరుమున్నీరవుతున్నారు ఆమె అభిమానులు. క‌రీంన‌గ‌ర్ రాజీవ్ నగర్‌కు చెందిన మహేష్ (Mahesh) అనే అభిమాని, పూజ చేసే పటాల పక్కనే జానకమ్మ తో దిగిన ఫోటో పెట్టుకుని పూజ చేస్తూ జానకమ్మ తో తనకున్న 35 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు

సిక్త్స్‌, సెవెన్త్ క్లాస్ చదివే రోజుల్లో పాటల పుస్తకం వెనుక ఉన్న అడ్రస్‌ చూసి ఉత్తరాలు రాయడం ద్వారా జానకమ్మతో పరిచయం ఏర్పడిందని. చెన్నై నుంచి హైదరాబాద్‌ వరకు దాదాపు 35 ఏళ్లుగా ఈ అనుబంధం కొనసాగుతూనే ఉందని. కేవలం అభిమానిగానే కాకుండా, కాలక్రమేణా తమ మధ్య ఒక కన్నతల్లి, కొడుకుల బంధం ఏర్పడిందని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్తే స్వయంగా వంట చేసి, ముద్దలు కలిపి తినిపించే మహోన్నత వ్యక్తిత్వం జానకమ్మదని 48 వేల పాటలు 20 భాషల్లో పాడిన లెజెండ్రీ సింగర్ జానకమ్మ అని కొనియాడారు.

వారానికి ఒకసారైనా ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునేవారని, వారం రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా చావు గురించి ప్రస్తావిస్తూ.. 'మీకు చావు వస్తే ఎలాంటి నొప్పి తెలియకుండా ప్రశాంతంగా ప్రాణం పోవాలి' అని తాను అంటే తాను అదే కోరుకుంటున్నట్టు అమ్మ చెపుతూ గట్టిగా నవ్వారన్నారు. ఆ మాట అన్న 10 రోజులకే ఆమె మనల్ని వదిలి వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని, ఎంతమంది వచ్చినా జానకమ్మ లోటు ఎప్పటికీ తీరనిదని మహేష్ కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - Jul 16 , 2026 | 05:53 PM