'పిల్లి బతికే ఉందా.. లేక హతమైందా?'.. కిరణ్ అబ్బవరం ‘హతః’ గ్లింప్స్ అదిరింది
ABN, Publish Date - Aug 31 , 2026 | 12:35 PM
కిరణ్ అబ్బవరం నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నూతన చిత్రం ‘హతః’ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరక్ (Anoosh Gorak) డైరెక్ట్ చేస్తుండగా శివశంకర నాయుడు, కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే.. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా పక్షి కాళ్లను చూపిస్తూ, 'ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్ ను మీరు ఊహించలేదు..'అంటూ వదిలిన పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఈక్రమంలో తాజాగా ఈ సినిమా గురించిన కీలక అప్డేట్స్ చిత్ర బృందం ప్రకటించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు ‘హతః’ (HATAH) అని టైటిల్ పెట్టినట్లు తెలియజేస్తూ.. “పిల్లి బతికే ఉందా.. లేక హతమైందా?” అనే ఆసక్తికరమైన ప్రశ్నతో గ్లింప్స్ విడుదల చేశారు.
కొత్తగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ తోనే కథలో దాగి ఉన్న మిస్టరీ ఏమిటన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఇప్పటికే థ్రిల్లింగ్ ఫీల్‌ను కలిగించిన చిత్ర యూనిట్, ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఈ సారి కూడా కిరణ్ అబ్బవరం ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నాడనే ఫీల్ తీసుకు వచ్చారు. ఇదిలాఉంటే సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.