రష్మిక.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
ABN, Publish Date - Apr 03 , 2026 | 06:49 PM
టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక (Rashmika Mandanna) గురించి మరోసారి గాసిప్స్ గుప్పుమంటున్నాయి.
టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక (Rashmika Mandanna) గురించి మరోసారి గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయి నెల కూడా సరిగ్గా గడవక మునుపే ఇప్పుడు మరో కొత్త వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది.
రాజస్థాన్‌లోని ఉదయపూర్(Udaipur) లో ఫిబ్రవరి 26న వీరి వివాహం, ఆపై హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా గ్రాండ్ నిర్వహించిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట పలుమార్లు పబ్లిక్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. అంతేగాక సాధారణంగా సెలబ్రిటీలు హనీమూన్‌కు వెళ్లే సమయంలో, వీరు మాత్రం సన్నిహితులతో కలిసి ‘బడ్డీ మూన్’ ట్రిప్‌కు వెళ్లి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉండగా, తాజాగా రష్మిక షేర్ చేసిన ఒక పోస్ట్ మరింత ఆసక్తిని పెంచింది. 'ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” అంటూ ఒక చిన్న యానిమేషన్ వీడియోను ఆమె పోస్ట్ చేయడంతో, నెటిజన్లు ఊహాగానాలకు తెరతీశారు. వీడియోలో విజయ్, రష్మికతో పాటు ఒక పొద్దుతిరుగుడు పువ్వు కనిపించడం, అలాగే ఆమె టీషర్ట్‌పై గుడ్డు చిత్రం ఉండటం వల్ల “గుడ్ న్యూస్ ఏమైనా ఉందా?” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే రశ్మిక చేసిన పోస్ట్ తో రశ్మిక తల్లికాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. రశ్మిక ఓ సన్ ఫ్లవర్ ను క్లోజ్ ఫ్రెండ్ గా భావిస్తుంది. దాని పేరు 'రు'. దాని కోసం ఇన్ స్టా లో అకౌంట్ కూడా ఉంది. తాజాగా ఆ యానిమేషన్ వరల్డ్ లోకి విజయ్ ను ఆహ్వానిస్తూ ఈ పోస్ట్ పెట్టగా వైరల్ గా మారింది.