సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nithiin: నితిన్‌.. ఆ దర్శకుడితో సినిమా ఆగిపోయినట్టేనా..

ABN, Publish Date - May 09 , 2026 | 01:26 PM

‘తమ్ముడు’ సినిమా పరాజయంతో నితిన్‌ (nithiin) కాస్త స్లో అయ్యారు. గత చిత్రం విడుదలై ఏడాది కావొస్తుస్తోంది.   సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు.

‘తమ్ముడు’ సినిమా పరాజయంతో నితిన్‌ (nithiin) కాస్త స్లో అయ్యారు. గత చిత్రం విడుదలై ఏడాది కావొస్తుస్తోంది.   సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు. ఆయ్‌ సినిమా ఫేం అంజి కె. మణిపుత్ర చెప్పిన కథ నచ్చడంతో దానికీ ఓకే చేశారు. ఈ రెండు సినిమాలు పార్లల్‌ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు నితిన్‌. తన చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారట నాగవంశీ.


ఈ రెండు సినిమాల కంటే ముందు విఐ ఆనంద్‌ (VI Anand) చెప్పిన సినిమా ఓకే చేశారు నితిన్‌. ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూశారు అభిమానులు. అయితే అనుకోకుండా ఆ సినిమా కథ కన్నా వెనుక విన్న కథలు ఓకే అయిపోయాయి. దాంతో అసలు వి.ఐ ఆనంద్‌తో సినిమా ఉంటుందా? ఉండదా అన్న చర్చ మొదలైంది. అయితే విఐ ఆనంద్‌ కథ నితిన్‌ నచ్చింది.. కానీ బడ్జెట్‌ కాస్త ఎక్కువే. అదే ఇప్పుడు సమస్య అని సమాచారం. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్‌కు మార్కెట్‌ కాస్త డల్‌ అయినట్లే.

దాంతో భారీ బడ్జెట్‌ పెట్టాలంటే నిర్మాతలు కాస్త వెనకడుగు వేయడం సహజం. ఖర్చు తగ్గేలా కొన్ని మార్పులు సూచించినట్లు తెలిసింది. అలాగే సెకెండాఫ్‌లో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయని, అందుకే కథతో చిన్న మార్పులు చేయాలని టీమ్‌ భావించిందట. అయితే ఆ మార్పులకు దర్శకుడు అంగీకరించలేదని, దాంతో ఈ ప్రాజెక్ట్‌ తాత్కాలికంగా పక్కకు వెళ్లిపోయిందని టాక్‌ నడుస్తోంది. అదే సమయంలో సితార బ్యానర్‌లో సినిమా ఓకే కావడంతో నితిన్‌ ఆ సినిమాతో బిజీ అయ్యారు. అయితే ఆ కథను వి.ఐ ఆనంద్‌ మరో హీరోకి కథ చెబుతున్నారని తెలిసింది. తను అనుకున్న బడ్జెట్‌ పెట్టే నిర్మాత కుదిరితే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందట.  ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా లేదా, వీఐ ఆనంద్‌ మరో హీరోతో ముందుకు వెళ్తాడా? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

Updated Date - May 09 , 2026 | 03:16 PM