ఆ సినిమాలతో పోటీ పడనున్న 'భోగి'..
ABN, Publish Date - Nov 11 , 2026 | 09:53 PM
యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), అనుపమ పరమేశ్వరన్ జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన చిత్రం భోగి (Bhogi). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), అనుపమ పరమేశ్వరన్ జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన చిత్రం భోగి (Bhogi). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై బాగా హైప్ ని పెంచేశాయి. మొదటి నుంచి భోగి నవంబర్ 12 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అయితే ఈమధ్యనే జరగాల్సిన భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఈ చిత్రం వాయిదా పడిందని వార్తలు గుప్పుమన్నాయి.
ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ భోగి సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ తేల్చి చెప్పారు. అనుకోని సాంకేతిక, నిర్మాణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని, సినిమా విడుదల వాయిదాపై సోషల్ మీడియాలో వస్తున్న ఎలాంటి అనవసర రూమర్లు, ఊహాగానాలను నమ్మవద్దని తెలిపారు. అంతేకాకుండా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన, గ్రాండ్ యాక్షన్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే పర్ఫెక్ట్ ఔట్పుట్ కోసం శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పనులు పూర్తి చేసి, త్వరలోనే సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం భోగి కొత్త డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొత్త పుకారు మొదలయ్యింది. డిసెంబర్ 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడుస్తోంది. అయితే అదే రోజున టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. పెద్ద పాన్ ఇండియా సినిమాలు లేవు కానీ, నోటెడ్ చిత్రాలు మాత్రం రెండు ఉన్నాయి. అవే ఇడుపు కాయితం, పాకెట్ రాకెట్స్. ఇవి కాకుండా ఇంకా అనుకోలేదు, రాయవలస లాంటి చిన్న సినిమాలు కూడా అదే రోజున వస్తున్నాయి. అయితే ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తోన్న ఇడుపు కాయితం, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న పాకెట్ రాకెట్స్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వీటితో శర్వా పోటీకి దిగుతాడా..? లేదా.. ? అనేది తెలియాలి.