సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్.. రాజకీయాల్లోకి అల్లు అర్జున్

ABN, Publish Date - May 30 , 2026 | 06:32 PM

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లోకి రావడం చూడలేదు కానీ, సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం మాత్రం చూస్తూనే ఉన్నాం.

Allu Arjun

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లోకి రావడం చూడలేదు కానీ, సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం మాత్రం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం అవ్వడం.. విజయ్ (Vijay) సీఎం అవ్వడం చూశాక ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు రాజకీయాలపై మక్కువ ఎక్కువ అయ్యిందని తెలుస్తోంది. వారినే ఆదర్శంగా తీసుకొని పలువురు హీరోలు రాజకీయ రంగప్రవేశం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం


తాజాగా ఇండస్ట్రీలో ఒక రూమర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం చేయాలని చూస్తున్నాడట. అది కూడా అచ్చం సీఎం విజయ్ అనుసరించిన వ్యూహన్నే అనుసరించి బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ ఈ మధ్యనే కొందరు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ భేటీల వివరాలు బయటకు రానప్పటికీ, ఆయన 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు పుకార్లు పుట్టుకొస్తున్నాయి.


దళపతి విజయ్ లానే అల్లు అర్జున్ కూడా ఇప్పటికే పలు ప్రాంతాలలో అత్యంత బలమైన అభిమాన సంఘాల నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడు. భవిష్యత్తులో ఆయన గనుక రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటే, ఈ క్షేత్రస్థాయి అభిమానుల మద్దతు ఆయనకు ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ రాకా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయ్యాకా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి నిజంగానే బన్నీ పొలిటికల్ ఎంట్రీ నిజమేనా.. పుకారు మాత్రమేనా అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - May 30 , 2026 | 06:52 PM