'బాహుబలి' క్లిప్‌తో అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:32 PM
అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ మరోసారి టాలీవుడ్ సినిమా సన్నివేశాన్ని తన సందేశం కోసం ఉపయోగించుకుంది.
అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ మరోసారి టాలీవుడ్ సినిమా సన్నివేశాన్ని తన సందేశం కోసం ఉపయోగించుకుంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’లోని యాక్షన్ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇరాన్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ నుంచి ఓ ఫైట్ క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా ఖాతాలో ‘బాహుబలి’లోని కీలకమైన యుద్ధ సన్నివేశాన్ని షేర్ చేసింది. కాలకేయుల సైన్యంతో బాహుబలి పోరాడే సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి.
ఈ క్లిప్‌కు ఇరాన్ తన దేశ వైఖరిని వివరించే సందేశాన్ని జోడించింది. తమ దేశం ఎవరికీ తలవంచబోదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో స్పష్టం చేసిన విషయాన్ని రాయబార కార్యాలయం గుర్తు చేసింది. బాహుబలి కాలకేయులను ఎలాగైతే ఎదుర్కొన్నాడో.. మా మాతృభూమి కోసం మేం కూడా మా రక్తాన్ని త్యాగంగా ధారపోస్తాం. మేం ఎప్పటికీ తలవంచం.. మోకాళ్లపై వంగం” అని పేర్కొన్నారు. మొన్న 'భగవంత్ కేసరి'.. ఇప్పుడు ప్రభాస్ ‘బాహుబలి’ సన్నివేశాన్ని ఉపయోగించడంతో మరోసారి తెలుగు సినిమా సోషల్ మీడియాలో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.
ALSO READ:
'బాహుబలి' క్లిప్‌తో అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
Impure: ‘ఓజీ’ తర్వాత తెలుగులో రాజకుమారి మరో పాట
Bollywood - IT Raids: బాలీవుడ్‌లో ఐటీ కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీ ఇంట సోదాలు