Bollywood - IT Raids: బాలీవుడ్‌లో ఐటీ కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్, వషు భగ్నానీ ఇంట సోదాలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:17 PM
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ సోదాలు (Income tax Raids) చర్చనీయాంశంగా మారాయి.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ సోదాలు (Income tax Raids) చర్చనీయాంశంగా మారాయి. సినీ నిర్మాణాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై అనుమానాల నేపథ్యంలో ముంబైలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth singh), ఆమె మామ నిర్మాత వషు భగ్నానీ తో పాటు పనోరమా స్టూడియోస్‌కు వంటి పేర్లు ఉండటం విశేషం. ముంబై ఐటీ శాఖకు చెందిన పలు బృందాలు ఒకేసారి రంగంలోకి దిగి సుమారు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇళ్లతో పాటు కార్యాలయాల్లోనూ అధికారులు కీలకమైన ఆర్థిక పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అయితే ఈ సోదాలకు సంబంధించి ఐటీ శాఖ నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
సినిమా నిర్మాణ ఖర్చులు, విదేశీ షూటింగ్‌లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా విదేశాలకు జరిగిన చెల్లింపులు, నిర్మాణ సంస్థల ఆర్థిక లావాదేవీలు, పన్ను లెక్కల్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనే కోణంలో వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె పలు భారీ చిత్రాల్లో నటించారు. మరోవైపు వషు భగ్నానీ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయనకు చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పలు చిత్రాలను నిర్మించింది. అలాగే పనోరమా స్టూడియోస్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ముఖ్యంగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీతో ఆ సంస్థకు మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగడం టాక్ అఫ్ ది బాలీవుడ్ గా మారింది.
ఇవి కూడా చదవండి:
Dulquer Salmaan: అది ఫేక్ అకౌంట్.. నమ్మి మోసపోవద్దు
‘రామాయణ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. యశ్ విశ్వరూపం
ప్రియుడిని పెళ్లాడిన ఆర్జీవీ హీరోయిన్.. ఫొటోలు వైరల్