తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక గీతం.. 4 భాషల్లో కీరవాణి స్వరాలు
ABN, Publish Date - Nov 26 , 2026 | 06:59 AM
డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ (Invest Telangana Global Summit) కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (The Chief Secretary of Telangana) సంజయ్ జాజు (Sanjay Jaju) తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) ఆధ్వర్యంలో ఈ గీతాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై బుధవారం ఆయన సచివాల యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
డిసెంబరు 7న సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా, డిసెంబరు 9న నిర్వహించే క్లైమేట్ సమావేశం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని సీఎస్ చెప్పారు. సదస్సు ప్రాంగణంలో 45కు పైగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనేందుకు హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.