ఇన్‌స్టాలో శ్రుతిమించిన విష్ణు ప్రియ అసభ్యకర ఫొటోలు, వీడియోలు! సైబర్ పోలీసులకు ఫిర్యాదు
ABN, Publish Date - Apr 12 , 2026 | 01:13 PM
ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ సమస్యల్లో చిక్కుకుంది.
ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ (Vishnupriya Bheemineni) సమస్యల్లో చిక్కుకుంది. గత కొంత కాలంగా అడపాదడపా సినిమాలు, టీవీ షో, బిగ్ బాస్ వంటి షోలతో రెండు తెలుగు రాష్ట్రాలలో.. తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను సంపాదించు కుంది. ముఖ్యంగా అర్ధనగ్న ఫొటోషూట్లతో తరుచూ కుర్రకారును కవ్విస్తూ, గ్లామర్ ఫొటోషూట్‌లు చేస్తూ.. వాటిని ఇన్‌స్టా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే 1.4 మిలియన్స్‌కు పైగా ఫాలోయర్స్‌తో సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. అయితే విష్ణు ప్రియ యువతను తప్పుదోవ పట్టిస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడలో పలువురు పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. గతంలో విష్ణు ప్రియ అప్పుడప్పుడు తన అందాల ప్రదర్శనతో యూత్‌లో కాక రేపేది. కానీ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో అయ్యే వారి కోసమే కాకుండా, కొత్త వారిని ఆకర్షించేందుకు గేర్ మార్చింది. కాస్త మోతాదు మించిన అందాలు ప్రదర్శిస్తూ వీడియోలను షూట్ చేసి, వాటిని ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్ ద్వారా షేర్ చేస్తోంది. వీటిని చూడాలని అనుకున్నవారు సబ్‌స్క్రిప్షన్ కింద నెలకు సుమారు రూ.399 సమర్పించుకోవాలి.
ఈ వ్యవహారమే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. చాలామంది.. ‘విష్ణుప్రియా ఇదేం పని?’ అంటూ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ పేరిట యువకులను తప్పుదోవ పట్టిస్తోందని, చెప్పలేని విధంగా వీడియోలను పెడుతూ, యూత్‌ను పాడు చేస్తోందని పబ్లిక్ దుయ్య బడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయవాడలో పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసు (Vijayawada Cyber Crime Police) లను ఆశ్రయించారు. ఇన్‌స్టాలో అసభ్యకర కంటెంట్ పోస్టు చేసి సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందని, వెంటనే సంబంధిత ఇన్‌స్టా అకౌంట్‌ను బ్లాక్ చేయించి, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.