సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సంబరాల ఏటిగట్టు.. క్లారిటీ ఇవొచ్చుగా తేజ్

ABN, Publish Date - Jun 22 , 2026 | 08:10 PM

మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సంబరాల ఏటిగట్టు (Sambarala yeti Gattu). దాదాపు రెండేళ్ల క్రితం భారీ ఎత్తున ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్నారు.

Sambarala Yetigattu

మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సంబరాల ఏటిగట్టు (Sambarala yeti Gattu). దాదాపు రెండేళ్ల క్రితం భారీ ఎత్తున ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్నారు. ఈ చిత్రం తేజ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేశాయి. ఇక తేజ్ మార్కెట్ స్థాయికి మించి వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. వాస్తవానికి గత ఏడాది దసరాకే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ డెడ్‌లైన్ ఎప్పుడో దాటిపోయింది. గత కొన్ని నెలలుగా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం, బడ్జెట్ పరిమితులు దాటిపోవడంతో నిర్మాత రికవరీ కోసం సతమతమవుతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఇక తాజాగా సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ పై తేజ్ స్పందించాడు. హనుమాన్ త్రీడీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా వచ్చిన తేజ్ కు మెగా అభిమానుల నుంచి సంబరాల ఏటిగట్టు రిలీజ్ డేట్ గురించి నేరుగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ, తేజు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'ప్రస్తుతం ఓటీటీ పుణ్యమా అని ప్రేక్షకులు ఎన్నో అంతర్జాతీయ సినిమాలు, సిరీస్‌లు చూస్తూ చాలా తెలివి సంపాదించారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కంటెంట్ ఇవ్వకపోతే ఆడియన్స్ అస్సలు సంతృప్తి చెందరు. ప్రేక్షకుల మారిన అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతోనే, సినిమాల విషయంలో మేము మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ టైమ్ తీసుకుంటున్నామని' తెలిపాడు.

అయితే తేజ్ చెప్పిన సమాధానంలో క్లారిటీ లేదు. షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది.. ? రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు అనేదానిమీద స్పస్టత లేదని అర్దమవుతోంది. దీంతో ఫ్యాన్స్.. దీనిపియ ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ రూమర్లపై కూడా టీమ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Updated Date - Jun 22 , 2026 | 08:12 PM