వంశీ నందిపాటి... 'ఇంకా ఏం అనుకోలేదు'!

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:30 AM

ఈటీవీ విన్‌తో కలిసి వంశీ నందిపాటి 'ఇంకా ఏం అనుకోలేదు' అనే సినిమా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న విడుదల కాబోతున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఆసక్తికరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.

Inka Em Anukoledu Movie

ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు వంశీ నందిపాటి (Vamsi Nandipati), ఈటీవీ విన్ (Etv Win) లది సక్సెస్‌ ఫుల్ కాంబినేషన్. ఈటీవీ విన్ సహకారంతో నిర్మితమైన పలు చిత్రాలను వంశీ నందిపాటి పంపిణీ చేసి, ఆ యా చిత్రాలను విజయపథంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో మరో క్రేజీ మూవీ రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను గోప్యంగా ఉంచుతూనే రిలీజ్ డేట్‌ను మాత్రం మేకర్స్ ప్రకటించారు. ఓ ఫన్నీ వీడియో ద్వారా ఆ వివరాలను తెలియచేశారు. సెప్టెంబర్ 4న విడుదల కాబోతున్న ఈ సినిమాకు 'ఇంకా ఏం అనుకోలేదు' అనే పేరు ఖరారు చేశారు.


ఈ చిత్రానికి రచయిత-దర్శకులుగా ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని ద్వయం పని చేస్తున్నారు. సంగీతం సింజిత్ ఎర్రమిల్లి అందించగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణ ప్రమోషన్ పద్ధతికి భిన్నంగా, మీమ్‌లతో నిండిన సరదా వీడియో రూపంలో టైటిల్‌ను ప్రకటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వీడియోలో మీమ్ రిఫరెన్సులు, వినోదాత్మక డైలాగ్స్‌, సటైర్ టచ్‌తో కూడిన హాస్యాన్ని చక్కగా మిళితం చేయడం వల్ల మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను అలరిస్తోంది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమణా రెడ్డి, సమీర్ కన్ను సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:31 AM