సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పిలిచి మరీ అవమానించాలా.. ఇంద్రజ కంటతడి

ABN, Publish Date - Jul 14 , 2026 | 04:13 PM

సీనియర్ నటి ఇంద్రజ (Indraja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరలేదు. ఆ జబర్దస్త్ షో నుంచి ఎప్పుడైతే రోజా వెళ్లిపోయిందో.. అప్పటి నుంచి ఇంద్రజ ఆ ప్లేస్ ని కబ్జా చేసింది.

Indraja

సీనియర్ నటి ఇంద్రజ (Indraja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరలేదు. ఆ జబర్దస్త్ షో నుంచి ఎప్పుడైతే రోజా వెళ్లిపోయిందో.. అప్పటి నుంచి ఇంద్రజ ఆ ప్లేస్ ని కబ్జా చేసింది. మధ్యలో చాలామంది సీనియర్ హీరోయిన్లు వచ్చినా ఇంద్రజ జడ్జిగా పాతుకుపోయింది. కేవలం జబర్దస్త్ షోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి కూడా ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక షోలో కంటెస్టెంట్స్ తో ప్రేమగా మాట్లాడడం, వారికి అడపాదడపా సాయం చేయడంతో అందరికీ ఇంద్రజమ్మగా మారిపోయింది.


ఇక ఈ షోస్ లలో జడ్జిలను కూడా రోస్ట్ చేయడం సర్వసాధారణమే. రోజా ఇంట్లో ఎలా ఉంటుంది.. ? రష్మీకి పెళ్లి అయితే ఎలా ఉంటుంది.. ? నాగబాబు సెట్ లో ఎలా ఉంటాడు.. ? ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని ప్రేక్షకులను నవ్వించడానికి కంటెస్టెంట్స్ స్కిట్స్ చేస్తూ ఉంటారు. అలానే ఇంద్రజ ఇంట్లో ఎలా ఉంటుందో అని బులెట్ భాస్కర్, ఫైమా.. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్కిట్ చేశారు. ఈ స్కిట్ పై ఇంద్రజ మండిపడింది. ఇలా పిలిచి మరీ అవమానించాలా అని కంటతడి పెట్టుకుంది.


ఫైమా.. ఇంద్రజలానే డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చి.. ఆమెలా మాటలను సాగదీస్తూ మాట్లాడింది. ఇక ఆ స్కిట్ కి అందరూ నవ్వగా.. ఇంద్రజ మాత్రం చాలా బాధపడింది. నేను ఇలా సాగదీసి మాట్లాడతానా.. ? పిలిచి మరీ నన్ను అవమానించడం కరెక్ట్ యేనా.. నాకేలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మంచిగా చేయండి.. అందరితో పాటు నేను నవ్వుతాను.. ఎందుకండీ పరువు తీస్తారు అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇక ఇంద్రజ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. ఆమె మరీ ఓవరాక్షన్ చేస్తోంది.. ఆ స్కిట్ లో ఏముంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఇది నిజమా.. లేక ప్రాంక్ చేసారా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 14 , 2026 | 06:59 PM