సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తిలక్‌ వ‌ర్మ‌కు.. రామ్ చ‌ర‌ణ్ పెద్ది బ్యాట్ గిఫ్ట్‌

ABN, Publish Date - Mar 19 , 2026 | 07:44 AM

ఇటీవ‌ల టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు సభ్యుడైన భారత క్రికెటర్‌ తిలక్‌ వర్మ రీసెంట్‌గా రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్‌ లొకేషన్‌కు వచ్చి అక్క‌డి వారిని ఆశ్య‌ర్య ప‌రిచారు.

ram charan tilak varma

ఇటీవ‌ల టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు సభ్యుడైన భారత క్రికెటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) రీసెంట్‌గా రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్‌ లొకేషన్‌కు వచ్చి అక్క‌డి వారిని ఆశ్య‌ర్య ప‌రిచారు.

ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు (Buchi Babu Sana) తో పాటు సెట్‌లో ఉన్న సిబ్బంది అంతా భార‌త మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున తిల‌క్ వ‌ర్మ‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆపై పెద్ది సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఉప‌యోగించిన క్రికెట్ బ్యాట్‌ను బ‌హుమ‌తిగా అంద‌జేశారు. ఇందుకు సంబంధ‌ఙంచిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఇదిలాఉంటే పెద్ది (Peddi) సినిమా ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Updated Date - Mar 19 , 2026 | 08:52 AM