సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deewana: సినిమా క్లైమాక్స్‌లో.. హీరో ఏడిపిస్తాడు

ABN, Publish Date - Jun 12 , 2026 | 07:36 AM

‘దీవానా’ అందరి హృదయాల్లోకి చొచ్చుకెళ్లే అందమైన ప్రేమకథ.. ముగింపు సన్నివేశాల్లో హీరో హర్షిత్ తన నటనతో కన్నీళ్లు తెప్పిస్తాడని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

Allu Aravind

‘దీవానా’ (Deewana) అందరి హృదయాల్లోకి చొచ్చుకెళ్లే అందమైన ప్రేమకథ. ఈ సినిమా ముగింపు సన్నివేశాల్లో హీరో హర్షిత్ (Harshith)తన నటనతో కన్నీళ్లు తెప్పిస్తాడు. అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు.

‘శుభం’ ఫేమ్‌ హర్షిత్‌ రెడ్డి, స్మేహ మణిమేగలై (Smeha) జంటగా శ్రీకాంత్‌ సంగిశెట్టి (Sreekanth)తెరకెక్కించిన చిత్రమిది. అర్హ మీడియా, వీ స్టూడియోస్‌ బ్యానర్‌పై వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ నెల 19న గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ మూవీ విడుదలవుతోందీ.


ఈ సందర్భంగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్‌, హీరో విష్వక్సేన్‌, నిర్మాత ధీరజ్‌ మొగలినేని అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen )మాట్లాడుతూ ‘దీవానా’ బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నా అని టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’ చెప్పారు.

‘దీవానా’ కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’ అని ధీరజ్‌ మొగిలినేని అన్నారు. ‘ఈ సినిమా మీ అందర్నీ భావోద్వేగానికి గురిచేస్తుంది’ అని శ్రీదేవి కార్యంపూడి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర‌వింద్‌, విశ్వ‌క్ సేన్‌ల న‌డుమ జ‌రిగిన ప‌లు సంభాష‌ణ‌లు అక్క‌డి వారిలో మ‌రింత హుషారును తీసుకు రావ‌డ‌మే గాక త‌మ మాట‌ల‌తో న‌వ్వులు పూయించారు.

Updated Date - Jun 12 , 2026 | 07:36 AM