Ram Charan: నా ఫిల్మ్ లైబ్రరీలో.. 'పెద్ది' నంబర్ వన్
ABN, Publish Date - May 24 , 2026 | 12:53 PM
'పెద్ది' అందరి మనసుని తాకుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది. నా ఫిల్మ్ లైబ్రరీలో 'పెద్ది' నంబర్ వన్ సినిమాగా నిలుస్తుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi) దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భోపాల్‌లో జరిగిన 'పెద్ది కి ఆవాజ్' బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా పాటలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. నమస్కార్ భోపాల్.. మధ్యప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా మనసులో మీ అందరికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘పెద్ది’ ప్రమోషన్స్‌ను భోపాల్ నుంచి ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ‘పెద్ది’ సినిమాను మేము ఎంతో మనసు పెట్టి తీశాం. ప్రతి భావోద్వేగం, ప్రతి కష్టం, ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం. ఈ నగరం ఎంత అందంగా ఉందో, ఇక్కడి ప్రజల మనసులు అంతకంటే అందంగా ఉన్నాయి. జూన్ 4న మీ హృదయాల్లో మా సినిమాకు ఒక స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి. రవికిషన్ గారు ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆయనకు నా ధన్యవాదాలు తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాగుతూ.. ‘పెద్ది’ ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కథ. ఆ పోరాటం మీ హృదయాలను తాకుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, స్ఫూర్తిని ఇస్తుంది. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే సినిమా ఇది. ఈ సినిమా కోసం మేమంతా ఎంత కష్టపడి, ఎంత ప్రేమతో పనిచేశామో ఆ భావన ప్రేక్షకులందరికీ చేరుతుందనే నమ్మకం నాకు ఉంది. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది. మా నిర్మాత సతీష్, దర్శకుడు బుచ్చిబాబు, నా సహనటులు జాన్వీ కపూర్, దివ్యేందు, రవికిషన్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మా సినిమాకు అతి పెద్ద బలంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన భోపాల్ ప్రజలకు, పోలీసు శాఖకు, గౌరవ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోపాల్.. నేను మళ్లీ వస్తాను. ‘పెద్ది’ సక్సెస్ టూర్ కూడా ఇక్కడే జరుపుకుంటాం. మీరు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఎంత ప్రేమ చూపించారో, అదే ప్రేమను ‘పెద్ది’కి కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకీ జై అంటూ స్రసంగం ముగించారు.