Allu Arjun: స్టాఫ్‌తో.. అల్లు అర్జున్ న్యూఇయర్ సెలబ్రేషన్స్!ఫొటోలు వైరల్
ABN, Publish Date - Jan 01 , 2026 | 08:42 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సిబ్బందితో కలిసి నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్టాఫ్‌తో కలిసి సెలబ్రేషన్ చేసిన అల్లు అర్జున్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నూతన సంవత్సరాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తన సినీ ప్రయాణంలో ప్రతి దశలో సాయం అందించిన సిబ్బందితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు.
ఈ ఘటనతో సినిమా అనేది కేవలం తెరపై కనిపించే హీరో ఒకడితోనే పూర్తయ్యేది కాదు, తెర వెనుక పనిచేసే ప్రతి ఒక్కరి కృషి, అంకితభావం వల్లే విజయం సాధ్యమవుతుందని అల్లు అర్జున్ మరోసారి నిరూపించారు.
లైటింగ్, కెమెరా, మేకప్, ప్రొడక్షన్, భద్రతా సిబ్బంది వరకు అందరితో కలిసి మాట్లాడుతూ, వారి సేవలను మనస్ఫూర్తిగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు రాగా ఫ్యాన్స్, సినీ లవర్స్ తిలకించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అయితే తమ హీరోను ఆకాశానికెత్తేస్తున్నారు.