సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priyanka Chopra: 14 నెలలుగా 'వారణాసి' కోసం కష్టపడుతున్నా.. ప్రియాంకా చోప్రా అంత మాట అనేసిందేంటి

ABN, Publish Date - Jul 15 , 2026 | 07:44 AM

రాజమౌళి పని తీరు, RRR గురించి ప్రియాంకా చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

priyanka chopra

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి (Varanasi) సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న‌ ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ స్థాయిలో మరో అడుగు వేయబోతున్నారని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పెడెప్పుడు విడుద‌ల అవుతుందా, అప్డేట్స్ ఎప్పుడు వ‌స్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో క‌థానాయిక‌గా మందాకిని పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల.. అమెరికాలో త‌న భ‌ర్త నిక్ జోనాస్ (Nick Jonas), మ‌రుదులు జో జోనాస్ (Joe Jonas), కెవిన్ జొనాస్ (Kevin Jonas) ల‌తో క‌లిసి చేసిన హై హార్ట్ రేడియో (i Heart Radio) హే జోనాస్ (Hey Jonas) పాడ్‌కాస్ట్‌లో 'వారణాసి' సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ఈ సినిమా కోసం దాదాపు 14 నెలలుగా పనిచేస్తున్నాను. కానీ ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాలు సమయం తీసుకుంటాయని అందరికీ తెలిసిందే. సినిమాలో నేను ఎన్నో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేశాను. ప్రస్తుతం అంతకంటే ఎక్కువ చెప్పలేను" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ప్రియాంక చేసిన మరో వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ (RRRmovie) సినిమా గురించి తనకు ఓ భారతీయేతర స్నేహితుడి ద్వారా తెలిసిందని ఆమె చెప్పడం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఈ విషయం 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు వచ్చిందో మరోసారి చాటుతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే ఆస్కార్ సహా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

Updated Date - Jul 15 , 2026 | 08:12 AM