సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kamakshi Bhaskarla: ‘అగధ’.. మహాదేవిగా గుర్తుండిపోతా

ABN, Publish Date - Aug 14 , 2026 | 06:53 AM

‘అగధ’ సినిమాలో మహాదేవి పాత్రలో నటించానని కామాక్షి భాస్కర్ల తెలిపారు. ఈ పాత్ర కోసం బుద్ధిజం, బ్లాక్ మ్యాజిక్, ముద్రలపై అవగాహన పెంచుకున్నానని చెప్పారు.

Kamakshi Bhaskarla

‘అగధ’ (Agadha) చూసి కన్నీళ్లు వచ్చాయని కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) అన్నారు. ‘మా ఊరి పొలిమేర’ చిత్రాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఆమె నటించిన తాజా చిత్రమిది. ఎమ్‌ఎస్‌ రాజు (MS Raju) దర్శకత్వంలో కాశీ విశాలాక్షి బొలుసు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ‘అగధ’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు కామాక్షి భాస్కర్ల. ‘ఇందులో నేను అమ్మవారి అనుగ్రహంతో పుట్టే మహాదేవి (Mahadevi) పాత్రలో కనిపిస్తాను. ఈ రోల్‌ను ప్రేక్షకులు చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఈ పాత్ర కోసం బుద్ధిజం, బ్లాక్‌ మ్యాజిక్‌, ముద్రలు ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాను.

ఎమ్‌ఎస్‌ రాజు అనుభవం, టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేసే చాలా అంశాలు ఉంటాయి. ఇందులో నా నటనను చూసి నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ నన్ను ‘అరుంధతి’లో అనుష్కతో పోల్చడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

నేను గ్లామరస్‌ రోల్స్‌ చేయడం కన్నా సాధారణ మహిళగా తెరపై కనిపించడానికే ఇష్టపడతా. ప్రస్తుతం ‘పొలిమేర 3’తో పాటు ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నా. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలు చేయడం ఇష్టం. గాయకురాలు బెల్లి లలిత బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే ఆ పాత్రను నా డ్రీమ్‌ రోల్‌గా భావిస్తా’ అని చెప్పారు.

Updated Date - Aug 14 , 2026 | 07:03 AM