సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhagyashri Borse: మహారాణి, యువరాణి పాత్రలు చేయాలని ఉంది

ABN, Publish Date - Jul 14 , 2026 | 06:08 PM

‘లెనిన్‌’ విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘భారతి’ పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

Bhagyashri Borse

‘లెనిన్‌’ విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘భారతి’ పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే అన్నారు. అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిశోర్‌ అబ్బూరు తెరకెక్కించిన చిత్రమిది. నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni), సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) మీడియాతో ముచ్చటించారు. ‘ప్రతి సినిమాను ఎంతో ఇష్టంతోనే చేస్తాం. ప్రతి సినిమా మాకు ప్రత్యేకమే. ‘లెనిన్‌’ (Lenin) విషయంలో ఒక మంచి కథ దొరికింది. మేమంతా ఈ సినిమాను బలంగా నమ్మాం. మా నమ్మకం నిజం కావడంతో ఈ విజయం మరింత భావోద్వేగంగా అనిపించింది. ప్రేక్షకులు ‘భారతి’ పాత్రను ఇంతగా అభిమానించడం చాలా సంతోషాన్నిస్తోంది.

అఖిల్ (Akhil Akkineni) చాలా అద్భుతమైన నటుడు. ఆయనకు ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మహారాణి, యువరాణి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి చిత్రాల విషయంలో రాజమౌళి మాస్టర్‌. ఎప్పుడో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని నా కోరిక. నా కెరీర్‌ ప్రారంభం నుంచి ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు అమ్మాయిలానే చూస్తున్నారు. అందుకే హైదరాబాద్‌, తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 06:55 PM