సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sampoornesh Babu: ఇంత సీరియస్‌ పాత్ర.. నేనెప్పుడూ చేయలేదు

ABN, Publish Date - Sep 16 , 2026 | 06:49 AM

‘నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ‘ది ప్యారడైజ్‌’ మరో ఎత్తు అని నటుడు సంపూర్ణేశ్ బాబు అన్నారు.

Sampoornesh Babu

‘నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) మరో ఎత్తు. భారీ బడ్జెట్‌ సినిమాలో, ఇంత సీరియస్‌ పాత్రను నేనెప్పుడూ చేయలేదు. పారితోషికం పరంగానూ నా బెస్ట్‌ మూవీ ఇది. అందుకే ప్రతి రోజూ సెట్లో భయభక్తులతో అడుగు పెట్టేవాడిని’ అని నటుడు సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) అన్నారు. నాని (Nani) హీరోగా శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ నెల 24న విడుదల కానుంది.

ఈ చిత్రంలో బిర్యానీ రోల్‌ చేసిన సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ ‘సాయి రాజేశ్ గారు ఫోన్‌ చేసి డైరక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెలను కలవమన్నారు. కలిసిన వెంటనే ఈ క్యారెక్టర్‌ గురించి చెప్పారు. రెండు, మూడు సార్లు లుక్‌ టెస్టులు చేశారు. సినిమాలో నాని గారికి ఫ్రెండ్‌ రోల్‌ చేశాను. సెట్లో ఆయన చాలా కంఫర్ట్‌గా ఉండేవారు. అందరూ పర్ఫెక్ట్‌గా చేసే వరకు ఎన్ని టేకులైనా విసుక్కునే వారు కాదు. మోహన్‌బాబుగారి కాంబినేషన్లో నాకు సీన్లున్నాయని తెలిసినప్పుడు చాలా సంబరపడ్డాను. బిర్యాని రోల్‌ కోసం బరువు తగ్గాను. ఈ సినిమా పూర్తయ్యేవరకు ఇంకే సినిమా చేయనన్న కమిట్‌మెంట్‌తో పనిచేశాను’ అని అన్నారు. మెగాస్టార్‌తో శ్రీకాంత్‌ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారా అని అడగ్గా ‘పాస్‌’ అని సమాధానం దాటవేశారు.

Updated Date - Sep 16 , 2026 | 07:01 AM