సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాపాడిన వ్యక్తిని మర్చిపోలేదు.. ట్రోలర్లకు కౌంటరిచ్చిన సాయి ధరమ్ తేజ్

ABN, Publish Date - Sep 25 , 2026 | 08:04 AM

త‌న‌కు జ‌రిగిన ప్ర‌మాదం విష‌యంలో కొంత‌కాలంగా ట్రోల‌ర్స్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

Sai Dharam Tej

రోడ్డు ప్రమాదం జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా హెల్మెట్ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam tej) పెట్టిన ఎమోషనల్ పోస్ట్‌పై కొందరు నెటిజన్లు అనుచిత విమర్శలు చేశారు. ఆనాడు ప్రాణాలు కాపాడిన అబ్దుల్ (Syed Abdul Farhan) కు ఏ సాయం చేయలేదంటూ నెగెటివ్ కామెంట్స్ చేయడంతో పాటు పాత వీడియోలతో ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

దీనిపై వెంటనే స్పందించిన తేజ్, ఆనాడే అబ్దుల్ కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం చేసి సత్కరించినట్లు ఫొటో సాక్ష్యాలతో దీటైన సమాధానం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నారని, అనవసరంగా వివాదాల్లోకి లాగడం ఇష్టం లేకే ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. దీంతో ఆధారాలు చూసిన సదరు నెటిజన్ వెనక్కి తగ్గి క్షమాపణల ధోరణిలో బెస్ట్ విషెస్ తెలపడంతో వివాదానికి పూర్తిగా తెరపడింది.

Updated Date - Sep 25 , 2026 | 08:07 AM