సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

I bomma: 'ఐ బొమ్మ' మ‌ళ్లీ.. వ‌చ్చేసింది

ABN, Publish Date - May 13 , 2026 | 11:37 AM

పొయాయ‌నుకున్న ఐ బొమ్మ, బ‌ప్పం మూవీ వెబ్‌సైట్స్‌ తిరిగి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాయి.

i bomma

కొన్ని సంవత్సరాల ఆపటు సినీ పరిశ్రమను వణికించింది ఐ బొమ్మ (iBomma) వెబ్ సైట్. చాలా ప్రయత్నాల తర్వాత పోలీసులు నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi) ని అరెస్టు చేయడంతో కేసు సంచలనంగా మారింది. ఆ తర్వాత ఐ బొమ్మ, బప్పం టీవీ సైట్లు కూడా పని చేయకపోవడంతో కొంత వరకూ పైరసీ ఇష్యూ సమిసి పోయిందని తెలుగు చలన చిత్రపరిశ్రమ ఓ అభిప్రాయానికి వచ్చింది. అయితే మరోవైపు మూవీ రూల్జ్ వంటి పైరసీ సైట్లు మాత్రం యాక్టివ్గానే పని చేస్తూ కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ పైరసీని అందిస్తూ వచ్చాయి. మూవీ రూల్జ్ కాకుండా పదుల సంఖ్యలో కొత్త పైరసీ సైట్లు సైతం ప్రేక్షకులకు పైరసీ కంటెంట్ ను అందిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మూతపడ్డాయనుకున్న ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్లు మళ్ళీ పైరసీని అందిస్తూ తమ ఉనికి పోలేదని చాటుకోవడం నెటిజన్లను అశ్చర్యానికి గురి చేసింది. ఇది పైరసీ వీక్షకులకు సంతోషాన్ని కలిగించే అంశం అయితే చిత్ర పరిశ్రమకు మాత్రం చేదు గుళిక. పైరసీ విషయంలో పోలీసులు పలు రకాల చర్యలు తీసుకున్నా ఈ పైరసీ సైట్లు మళ్లీ ప్రారంభం కావడంపై సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. అసలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంర ఎప్పుడు లభిస్తుందో అని తలలు పట్టుకుంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో పోలీసులు ఆ దిశగా ఎటాంటి చర్యలు తీసుకుంటారో? ఐ బొమ్మతో పాటు ఇతర పైరసీ సైట్స్ మూసి వేతకు ఎలాంటి కృషి చేస్తారో!?

Updated Date - May 13 , 2026 | 11:46 AM