Dhashvika: మాది వైజాగ్.. స్కూల్ టైంలోనే హీరోయిన్ అవుతానని చెప్పానటా
ABN, Publish Date - Oct 01 , 2026 | 05:57 PM
పెద్దయ్యాక ఏమవుతావని చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ అడిగితే ‘హీరోయిన్’ అని చెప్పానట అని నాయిక దష్విక అన్నారు.
‘పెద్దయ్యాక ఏమవుతావని చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ అడిగితే ‘హీరోయిన్’ అని చెప్పానట. అప్పటి నుంచి నా ఇష్టాన్ని మా వాళ్లు ప్రోత్సహించారు. ‘తత్వం’(Tatvam) లో నటించడం ఆనందంగా ఉంది’ అని నాయిక దష్విక (Dhashvika ) అన్నారు. దినేష్ తేజ్ (Dinesh Tej) హీరోగా నటించిన ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకుడు. శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మాతలు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఈ సందర్భంగా దష్విక విలేకరులతో మాట్లాడుతూ ‘మాది వైజాగ్. మోడలింగ్ చేశాను. ఆ క్రమంలోనే విజయ్ దేవరకొండతో కలిసి ఓ యాడ్‌లో నటించాను. ‘తత్వం’లో నటనకు స్కోప్ ఉన్న రోల్ చేశాను. మర్డర్ మిస్టరీ సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతుంది.
తొలి సినిమాకు నన్ను అందరూ సపోర్ట్ చేసిన తీరు ఇండస్ట్రీ మీద కాన్ఫిడెన్స్ పెంచింది. మా దర్శకుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి సెలవు పెట్టి ఈ సినిమా చేశారు. తప్పకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దారు’ అని అన్నారు. తెలుగు, తమిళంలో కొత్త ప్రాజెక్టులు త్వరలోనే మొదలవుతాయని తెలిపారు.