Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు
ABN, Publish Date - Sep 20 , 2026 | 10:02 PM
ఇటీవల కాలంలో కథ, కథనంలో సత్తా లేకపోయినా.. కేవలం అడల్ట్ కంటెంట్, బోల్డ్ సీన్లతో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించవచ్చనే భ్రమలో కొందరు మేకర్స్ సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు పక్కా ఉదాహరణే ఈ హుషారు పిట్టలు చిత్రం.
ఇటీవల కాలంలో కథ, కథనంలో సత్తా లేకపోయినా.. కేవలం అడల్ట్ కంటెంట్, బోల్డ్ సీన్లతో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించవచ్చనే భ్రమలో కొందరు మేకర్స్ సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు పక్కా ఉదాహరణే ఈ హుషారు పిట్టలు (Husharu Pittalu) చిత్రం. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్ లో మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అసలు దీనికి హుషారు పిట్టలు అని పేరు పెట్టే బదులు మసాలా పిట్టలు అని పెట్టుకుంటే బాగుండేదని చెప్పుకొస్తున్నారు,
సినిమా కథ విషయానికి వస్తే.. పోర్న్ వీడియోలకు అలవాటుపడిన ఒక యంగ్ కుర్రాడు, పక్క వీధిలో ఉండే ఒక అమ్మాయితో ప్రేమాయణం నడుపుతాడు. అబ్బాయిని మించి నిరంతరం ఆ కోరికల గురించే ఆలోచించే అమ్మాయి మరింత రెచ్చగొడుతుంది. దీంతో యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమితో ఇద్దరూ దారి తప్పి, హద్దులు దాటే దాకా వెళతారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసి.. ఇద్దరిని ఏం చేశారు..? చివరికి వారి ప్రేమ కథ ఎలా ఎండ్ అయ్యింది..? అనేది కథ. సినిమా మొత్తం హీరో హీరోయిన్లు చేసే విపరీత చేష్టలు చూస్తుంటే ఆడియన్స్‌కు పిచ్చెక్కడం ఖాయం. అసలు ఇంట్లో పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, చిన్నపిల్లల ముందు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే పాయింట్‌ను చెప్పాలనుకున్నారా లేక అడల్ట్ డ్రామాను హైలైట్ చేయాలనుకున్నారా అనేది మేకర్లకే తెలియాలి. టీనేజ్ లవ్ స్టోరీ, యూత్ అవేర్‌నెస్ అని కలరింగ్ ఇచ్చినప్పటికీ, సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కేవలం సిల్లీ సీన్లు, సిగ్గుచేటు సంభాషణలతో ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టారు.
ఇక సినిమాలో లాజిక్స్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. కథ ముందుకు సాగేకొద్దీ ఏమాత్రం సంబంధం లేని మలుపులు, సడన్‌గా వచ్చే పోక్సో కేసులు, లీగల్ డ్రామాలు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. టీనేజ్ వయసులో అవగాహన లోపం వల్ల వచ్చే సమస్యల గురించి సందేశం ఇస్తున్నాం అని చెప్తూనే, స్క్రీన్ నిండా కేవలం క్రింజ్ కంటెంట్‌ను నింపేశారు. ఈ సినిమా ఫ్యామిలీతో చూస్తే.. ఇంట్లోవాళ్ళు కచ్చితంగా చెప్పుతో కొడతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడతారు. చివర్లో ఇచ్చే ఒక చిన్న సందేశం కోసం మొత్తం సెన్స్ లేని ఎబ్బెట్టు సన్నివేశాలను చూడాల్సి వస్తుంది. యూత్‌ను ఆకట్టుకోవడానికి కేవలం బోల్డ్‌నెస్ ఒకటే సరిపోదని, దానికి కాసింత కథ, కాసింత బుర్ర కూడా కావాలని కొందరు చెప్పుకొస్తున్నారు.