సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Director Bhikshu: వింటేజ్ చిరంజీవి కాదు.. కొత్త చిరంజీవి కావాలి

ABN, Publish Date - Aug 22 , 2026 | 03:09 PM

‘హుషారు పిట్టలు’ సినిమా దర్శకుడు బిక్షు చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘హుషారు పిట్టలు’ సినిమా దర్శకుడు బిక్షు (Bhikshu) చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానినని, ఆయనతో సినిమా చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. శనివారం 'హుషారు పిట్టలు' సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై చిరంజీవికి (Chiranjeevi) పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

“నేను చిరంజీవి అభిమానిని. ఆయనతో సినిమా చేయడానికే ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన ఇప్పుడు 100వ మెట్టుపై ఉన్నారు. నేను మాత్రం ఇప్పుడే మొదటి మెట్టు ఎక్కాను. ఇంకో రెండు సినిమాలు హిట్ కొట్టి చిరంజీవి గారి ఇంటి ముందు కూర్చుంటాను. అందరూ 'బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.. ఎందుకు బ్యాక్? ఫార్వర్డ్ అవ్వాలి కదా. వింటేజ్ చిరంజీవి అంటున్నారు. నాకు కొత్త చిరంజీవి కావాలి. ఆయనతో అన్నీ రిపీట్ సినిమాలే చేస్తున్నారు. అవకాశం వస్తే నేను మాత్రం చిరంజీవి గారితో కొత్తగా సినిమా చేస్తాను.  ఒక వేళ ఆయన ఆఫర్ ఇవ్వకపోతే ఏఐలో తీసి చూపిస్తా' అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 22 , 2026 | 03:09 PM