హృదయం మురళీ.. థమన్ యాక్టింగ్ ఇరగదీశాడు
ABN , Publish Date - Jul 07 , 2026 | 09:39 PM
తమిళ్ హీరో అధర్వ (Atharvaa) హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం హృదయం మురళీ (Hrudhayam Murali). ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామలు కయాదు లోహార్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించారు.
తమిళ్ హీరో అధర్వ (Atharvaa) హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం హృదయం మురళీ (Hrudhayam Murali). ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామలు కయాదు లోహార్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ గెస్ట్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
హృదయ అనే కుర్రాడి కథనే హృదయం మురళీ. అతని జీవితంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలకు తన ప్రేమను వ్యక్తం చేయకుండా.. దానికి కారణం కూడా చెప్పకుండా ఆగిపోతాడు. ఆ ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్యలో హృదయ ఎలా నలిగిపోయాడు. అసలు ప్రేమను వ్యక్తం చేయకపోవడానికి కారణం ఏంటి.. ? చివరికి హృదయ హృదయంలో ఎవరు ఉన్నారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నాలాగే ప్రేమను చెప్పలేకపోయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు సార్.. వాళ్లు ప్రేమనూ చెప్పలేరు.. అందుకు కారణం చెప్పలేరు అనే డైలాగ్ తోనే ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా కథ కూడా ఇదే.
ఇక అధర్వ తండ్రి.. నటుడు మురళీ కెరీర్ లో హిట్ అందుకున్న ఇదయం టైటిల్ ని ఈ సినిమాకు పెట్టారు. ఆ టైటిల్ కి తండ్రి పేరు యాడ్ చేసి తమిళ్ లో ఇదయం మురళీగా వస్తుండగా.. తెలుగులో హృదయం మురళీ పేరుతో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో హైలైట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నటించడమే. బాయ్స్ సినిమా తరువాత థమన్ నటించిన చిత్రం. ఇందులో థమన్ కి జంటగా నిహారిక NM నటించింది. అధర్వ ఫ్రెండ్స్ గా థమన్, నిహారిక నటనతో ఇరగదీశారు. ఇక చివర్లో ఫహద్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. జులై 10 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అధర్వ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.