బిగ్ బాస్ ని వాడుకున్న ఏకైక నటుడు ఇతనే..
ABN, Publish Date - Jul 06 , 2026 | 05:25 PM
అదృష్టం.. ఎవరిని, ఎప్పుడు, ఏ రూపంలో వరిస్తుందో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతకాలంలో కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఒక షో అంతెందుకు ఒక రీల్ ద్వారా కూడా ఫేమస్ అవుతున్నారు.
అదృష్టం.. ఎవరిని, ఎప్పుడు, ఏ రూపంలో వరిస్తుందో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతకాలంలో కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఒక షో అంతెందుకు ఒక రీల్ ద్వారా కూడా ఫేమస్ అవుతున్నారు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా మారుతున్నారు. ఇక బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోని వాడుకొని ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆ షోని వాడుకొని కెరీర్ ని బిల్డ్ చేసుకోలేకపోయారు. చాలామంది ప్రయత్నించినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్కరూ మాత్రమే సక్సెస్ అయ్యారు. ఆ ఒక్కడే.. శివాజీ (Sivaji). చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని మొదలుపెట్టిన శివాజీ.. నెమ్మదిగా హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే శివాజీ పాలిటిక్స్ అంటూ వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చాడు.
ఇక అసలు ఇండస్ట్రీలో తన ఉనికే మర్చిపోయిన తరుణంలో శివాజీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. పెద్దన్నగా మారి.. తన ఆటతో కాకుండా స్ట్రాటజీతో పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా నిలబెట్టినా.. తానే విన్నర్ గా బయటకి వచ్చాడు. ఇక వచ్చిన దగ్గర నుంచి శివాజీ తన ఆట మొదలుపెట్టాడు. మంచి మంచి కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. బిగ్ బాస్ నుంచి బయటకు రాకముందే ఆయన నటించిన #90 s వెబ్ సిరీస్ మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత కోర్ట్ సినిమాతో మంగపతిగా మారి .. ఇండస్ట్రీని ఊపేశాడు. ఇక అక్కడి నుంచి శివాజీ ఎంచుకొనే ఒక్కో సినిమా అతని ఎదుగుదలకు ఒక్కో మెట్టుగా మారాయి. దండోరా, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని లాంటి సినిమాలు అతడి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. జులై 10 న రిలీజ్ అవుతోన్న లెనిన్ లో కూడా శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అలా టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శివాజీ.. ఇప్పుడు తమిళ్ లో కూడా ఏఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా.. మమితా బైజు నటిస్తోన్న చిత్రంలో శివాజీ కీలక పాత్రలో నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అవకాశాలు రావడం ముఖ్యం కాదు.. వాటిని ఎలా అందుకున్నాం అనేది ముఖ్యం. శివాజీ వాటిని చక్కగా అందుకొని కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్స్ ని పూర్తిచేసింది. కానీ, అందులో ఉన్నవారెవ్వరూ కూడా ఈ షో ఇచ్చిన క్రేజ్ ని వాడుకోలేకపోయారు.. ఒక్క శివాజీ తప్ప. మరి ముందు ముందు శివాజీ ఏ రేంజ్ సినిమాలలో కనిపిస్తాడో చూడాలి.