సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naveen Chandra: 'హనీ' థియేటర్ లో చూడాల్సిన సినిమా!

ABN, Publish Date - Feb 02 , 2026 | 04:42 PM

నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై, దివి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'హనీ'. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

Honey Movie team

నవీన్ చంద్ర (Naveen Chandra), దివ్య పిళ్లై (Divya Pillai), దివి (Divi) ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సైకలాజికల్ హారర్ మూవీ 'హనీ'. రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, ' ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మౌత్ టాక్ తో నిలబడే సినిమా. మాకు ఉన్న బడ్జెట్లో థియేటర్స్ కి తీసుకొచ్చి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఫిబ్రవరి 6న దయచేసి ఒకసారి థియేటర్ కి రండి. ఇది థియేటర్ కి చాలా బాగుంటుంది. దివి చాలా అద్భుతమైన నటి. తను తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. దివ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఆలోచన రేకెత్తించే సినిమా. ఇందులో ఉన్న పాప కూడా చాలా చక్కగా నటించింది. మట్కా సినిమా సమయంలో కరుణ కుమార్ గారితో చాలా దగ్గర ఆయను. ఈ కథకు ఆయన నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఈ సమాజంలో ఆశ కోసం ప్రజలు ఏవేవో చేస్తున్నారు. ఇందులో ఒక డార్క్ సొసైటీని చూపించాం. ఈ కథ విన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం విక్టిమ్ అవుతాం. ఆనంద్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి కథలు మరిన్ని వస్తాయి. ఈ సినిమా చేసిన్నప్పుడు చాలా మ్యాడ్ నెస్ లో ఉన్నాను. చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ సినిమా షూటింగ్లో ఒక సంఘటన జరిగింది. ఈ క్యారెక్టర్ ప్రభావం వల్ల ఒక వ్యక్తితో నేను దురుసుగా ప్రవర్తించాను. అయితే అది నేను కాదు. ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది' అని అన్నారు.


డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ, 'నేను చీకటి అనే కథ రాశాను. దాన్ని సినిమాగా తీద్దామని మా నిర్మాతలు వచ్చారు. మదనపల్లి, పాతబస్తీలలో ఒకే ఇంట్లో కొందరు ఉరి వేసుకోవడం లాంటి ఘటనలు చూశాం. అలాంటి నిజ జీవిత సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని సినిమా చేయడం జరిగింది. మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం లేదనేది ఈ సినిమా సారాంశం. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. కొత్త కథలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నవీన్ చంద్ర ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. అలాగే రాజా రవీందర్ గారి పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. దివి, దివ్య అందరు కూడా ఒకరికి మించి ఒకరు చేశారు. మా టెక్నికల్ టీం కూడా చాలా సపోర్ట్ చేసింది ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి కాన్సెప్టు ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో రాలేదు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ దివి, దివ్యా పిళ్ళై, రాజా రవీంద్ర తదితరులు తమ అనుభవాలను తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 04:48 PM