రణబాలి.. మమ్మీ విలన్ లుక్ అదిరింది

ABN , Publish Date - Jun 16 , 2026 | 07:50 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం రణబాలి (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Ranabaali

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం రణబాలి (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక రణబాలి చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర కోసం ఏకంగా హాలీవుడ్ దిగ్గజ నటుడు, ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూని రంగంలోకి దించిన విషయం తెల్సిందే. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రణబాలి నుంచి ఆర్నాల్డ్ వోస్లూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి బర్త్ డి విషెస్ తెలిపారు. ఈ చిత్రంలో ఆర్నాల్డ్ వోస్లూ.. సర్ థియోడర్ హెక్టార్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ది డెమన్ ఆఫ్ డ్రాట్ అనే క్యాప్షన్ ఇచ్చి.. ఆయన ఎంత క్రూరమైన విలనో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్ థియోడర్ హెక్టార్ పాత్ర విజయ్ దేవరకొండకు సినిమాలో గట్టి పోటీ ఇవ్వబోతోందని అర్థమవుతోంది. ఒక పవర్‌ఫుల్ ఇంటెన్సివ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ, ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవబోతున్నాయట. ఇంటర్నేషనల్ మేకింగ్ వాల్యూస్ మరియు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే రాహుల్ - విజయ్ కాంబోలో టాక్సీవాలా సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కొన్నాళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తోన్న విజయ్ కి రాహుల్ మరో విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Updated Date - Jun 16 , 2026 | 07:52 PM