సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'రాకా' కు మార్వెల్ టెక్నీషియ‌న్లు.. రిలీజ్ ఇక అప్పుడే!

ABN, Publish Date - Apr 20 , 2026 | 06:42 PM

అల్లు అర్జున్, అట్లీ రాకా సినిమా రిలీజ్‌ డేట్‌ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Allu Arjun

పుష్ప (Pushpa) సిరీస్‌తో అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్‌ వంద రెట్లు పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో అల్లు అర్జున్ తీయబోయే నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ఆడియెన్స్‌లో అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంటాయి. ఇక కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన అట్లీ (Atlee) దర్శకత్వంలో అంటే అది మాస్ బీస్టే. కానీ ఈసారి అట్లీ రెగ్యులర్‌ జోనర్‌ కాకుండా ఈ సారి సోషియో ఫాంటసీ, మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌ను వీటన్నింటని బేస్‌ చేసుకొని మరీ రాకా (Raaka) ప్రాజెక్ట్‌తో భారీగా రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే అన్నీ ఓకే అయినా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాకా కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమా కూడా. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika Padukone)తో పాటు, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి క్రేజీ హీరోయిన్లు లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్స్ ఉండటంతోనే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక అసలు సర్ప్రైజ్ ఏంటంటే.. ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna)నెగటివ్ రోల్ పోషిస్తుందని ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీవల్లిగా బన్నీతో డ్యూయెట్లు పాడిన రష్మిక, ఇప్పుడు విలన్‌గా అతన్ని ఎదుర్కోబోతుందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు అట్లీ కేవలం మేకింగ్‌తోనే కాదు, టెక్నికల్ వాల్యూస్‌తో కూడా మాయ చేస్తాడు. రాకా కోసం ఏకంగా హాలీవుడ్ టాప్ స్పెషలిస్ట్‌లు రంగంలోకి దిగుతున్నారు. లోలా వీఎఫ్ఎక్స్ , స్పెక్ట్రల్ మోషన్, ఐరన్‌హెడ్ స్టూడియోస్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాయి. మార్వెల్ సినిమాలకి పని చేసే రేంజ్ టెక్నీషియన్స్ మన బన్నీ సినిమా కోసం వర్క్ చేస్తున్నారంటే.. స్క్రీన్ మీద విజువల్ వండర్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో మెట్టు ఎక్కించాలని టీమ్ గట్టి పట్టుదలతో ఉంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివరి కల్లా సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ ఏడాది చివరలోనే రిలీజ్ అనుకున్నప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందుకే వచ్చే ఏడాది అంటే 2027 ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బన్నీ పుష్ప సెంటిమెంట్‌ను ఫాలో అయితే మాత్రం డిసెంబర్ ఎండింగ్‌లో రిలీజ్ ఉండొచ్చు. లేదా 2027 దసరా పండుగ సీజన్‌ను టార్గెట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా రాకా అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.

Updated Date - Apr 20 , 2026 | 06:42 PM