సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాకా ధూమ్ ధమాకా.. క్రేజీ కళ్యాణం సాంగ్ కేక

ABN, Publish Date - Sep 12 , 2026 | 07:13 PM

దర్శక నటుడు తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల దర్శకత్వంలో భూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతుంది.

Crazy Kalyanam

దర్శక నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bascker), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్రేజీ కళ్యాణం (crazy Kalyanam). భద్రప్ప గాజుల దర్శకత్వంలో భూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ జోష్‌తో కూడిన ఒక లిరికల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కాకా ధూమ్ ధమాకా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


మాస్ అండ్ ఫోక్ బీట్స్‌కు పేరుగాంచిన సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ పాటను ఎంతో శక్తివంతమైన ట్యూన్‌తో స్వరపరిచగా.. ప్రముఖ జానపద గాయకుడు జంగి రెడ్డి తనదైన శైలిలో పవర్‌ఫుల్ వోకల్స్‌తో ఈ పాటను పాడాడు. సురేష్ బొబ్బిలి స్వయంగా అందించిన ర్యాప్ వోకల్స్ పాటలోని జోష్‌ను రెట్టింపు చేశాయి. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన మాస్ లిరిక్స్ వినేకొద్దీ పాడేలా, డాన్స్ వేసేలా ఉన్నాయి. ఈ పాటలోని విజువల్స్, తరుణ్ భాస్కర్ ఎనర్జిటిక్ మాస్ అవతార్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


పెళ్లి సందడి, వేడుకల బ్యాక్‌డ్రాప్‌లో ఎనర్జిటిక్‌గా సాగే ఈ సంబరాల పాట థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్- అఖిల్ రాజ్ పెళ్లి వేడుకలో ఈ సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ జోడీ స్క్రీన్ ప్రజెన్స్ , డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పక్కా తెలంగాణ మాస్ వైబ్‌తో తెరకెక్కిన ఈ వేడుక పాట సంగీతప్రియులను విశేషంగా అలరిస్తూ ట్రెండింగ్ చార్ట్స్‌లో నిలుస్తోందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి ఈ సినిమాతో తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Sep 12 , 2026 | 07:13 PM