సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి ఊపునిచ్చే ‘డిస్కో లైట్’ సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Jul 27 , 2026 | 10:37 PM

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’.

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ‘డిస్కో లైట్’ అంటూ సాగే ఓ మాసీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పార్టీ వైబ్‌ ఇస్తోన్న ఈ పాటలో హీరోయిన్లు, కబీర్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం, గీతా మాధురి గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ మోపురి బాణీ ఎంతో క్యాచీగా అనిపిస్తోంది. ఇక ఈ పాట ఇన్ స్టంట్‌గా యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచేలా ఉంది.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో చిత్రయూనిట్ అంచనాల్ని పెంచనుంది.

Updated Date - Jul 27 , 2026 | 10:37 PM