అమ్మా, నాన్న, పవన్ కల్యాణ్.. హే చికితా ట్రైలర్
ABN, Publish Date - Jul 21 , 2026 | 02:48 PM
రైతు గొప్పతనాన్ని ప్రతిబింబించే 'హే చికీతా' సినిమా జూలై 24న విడుదల కానుంది. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది. అందుకే రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో తీసిన ‘హే చికీతా’ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవిప్రసాద్, ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో ఎన్ అశోక, ‘గరుడవేగ’ అంజి నిర్మించారు.
ఇటీవల జరిగిన కార్యక్రమంలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్, వి.ఎన్. ఆదిత్య, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అశోక్ మాట్లాడుతూ, 'రైతు జీవితంలోని భావోద్వేగాలు, అతని కష్టాలను హృదయానికి హత్తుకునేలా సినిమాలో చూపించామ'ని చెప్పారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి సినిమాను చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.