Hey Chikittha: ‘హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:48 PM

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై.. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హే చికీతా’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Hey Chikittha Movie Still

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై.. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హే చికీతా’ (Hey Chikittha). ధన్ రాజ్ లెక్కల (DhanRaj Lekkala) దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అభినవ్ మణికంఠ (Abhinav Manikanta), దివిజ (Divija Prabhakar), తన్మయి కుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ చిత్రం టీజర్‌ని సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ.. దర్శకులు నాగేశ్వర్ రెడ్డి, దశరథ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా టీజర్‌ని గమనిస్తే..

ప్రస్తుతం పల్లెటూర్లలో యూత్ పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రేమలు ఎలా ఉన్నాయి? రైతులు, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారనే విషయాలను హైలెట్ చేస్తూ.. ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా టీజర్ తెలియజేస్తోంది. ఉద్యోగం ఉంటేనే పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనే రోజులివి. ఆ విషయాన్ని చక్కని ప్రేమకథతో ఇందులో తెలిపినట్లుగా తెలుస్తోంది. నేచురల్ లొకేషన్స్‌, సెన్సిబుల్ మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Hey-Chikittha-Teaser-Launch.jpg

టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. ‘గరుడవేగ’ అంజి వల్లే నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. నన్ను నమ్మి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్‌కు థాంక్స్. నేను పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఊర్లో ఉండే ఓ ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారనేది ఈ సినిమా కథ. అందుకే ‘హే చికీతా’ అనే టైటిల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాలో ఇంట్రో సాంగ్‌లో మూడు నిమిషాల పాటు సందేశాన్ని ఇస్తారు. నేను అదే లైన్‌తో రైతుల గురించి మూడు గంటల పాటు సినిమా తీశాను. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి ఈ కథను రాసుకున్నాను. ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. మా అన్న చరణ్ అర్జున్ నాకెప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. రైతుల గురించి మాట్లాడే, ఆలోచించే ప్రతీ ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.


నిర్మాత గరుడవేగ అంజి మాట్లాడుతూ.. కొత్త కథల్ని అందించాలనే ఉద్దేశంతోనే మేము బ్యానర్లను ప్రారంభించాం. మా ఆధ్వర్యంలో మరిన్ని మంచి చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ‘హే చికీతా’ అద్భుతంగా వచ్చింది. మేం ఎంతో మంది గొప్ప దర్శకుల్ని, ఆర్టిస్టుల్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అశోక్ ఎక్కువగా మాట్లాడరు. జూలై 24న మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. కంటెంట్ ఉంటే డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, ఆడియెన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్క గెస్ట్‌కి థ్యాంక్స్. మా సినిమాని మీడియా ముందుండి నడిపించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా చిత్రయూనిట్‌తో పాటు, హాజరైన అతిథులందరూ ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!

Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..

Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే

Updated Date - Jun 27 , 2026 | 07:51 PM