సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karthi: హీరోయిన్లను.. గ్లామర్ కోసం తీసుకోలేదు

ABN, Publish Date - Sep 07 , 2026 | 07:17 AM

సర్దార్ చిత్రాన్ని ఇంకా మర్చిపోలేక పోతున్నామని చాలా మంది చెబుతున్నారు. సర్దార్ 2 కాన్సెప్ట్ పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని కార్తి అన్నారు.

Sardar 2 Karthi

“సర్దార్” చిత్రాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నామని చాలా మంది చెబుతు న్నారు. సర్దార్ 2 (Sardar 2) కాన్సెప్ట్ పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. లార్జర్ స్కేల్‌లో ఈ చిత్రాన్ని చేశాం. ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన యాక్షన్ అద్భుతంగా కుదిరింది' అని హీరో కార్తి (Karthi) అన్నారు. ఆయన నటించిన 'సర్దార్2' చిత్రానికి మిత్రన్ (P. S. Mithran) దర్శకుడు, లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ 'సర్దార్' సక్సెస్ అయిన వెంటనే సీక్వెల్ స్టార్ట్ చేద్దామంటే పర్ఫెక్ట్ కథ దొరకలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని డైరక్టర్ మిత్రన్ ఎంతో జాగ్రత్తగా ఈ కథ రాశారు. స్పై సినిమాలంటే ఇంటర్నేషనల్ లెవల్లో పోరాడినట్టు చూపిస్తుంటారు. కానీ, మా సినిమా అంతర్గత సమస్య గురించి మాట్లాడుతుంది. తండ్రీ కొడుకులుగా కనిపించడానికి చాలా కష్టపడ్డాను. కొడుకుతో పోలిస్తే తండ్రి అత్యంత ప్రతిభావంతుడు. ఆ విషయాన్ని ప్రతి రోజూ సెట్‌లో గుర్తు పెట్టుకుని మరీ నటించేవాడిని. వ్యక్తిగతంగా ఈ సిని మాను చాలా ఆస్వాదించాను. యూనివర్శల్‌గా కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కించాం అన్నారు.

హీరోయిన్లను గ్లామర్ కోసం తీసుకోలేదని.. వాళ్లల్లో ఉన్న ప్రతిభను 'సర్దార్2'లో చాలా స్ట్రాంగ్‌గా చూపించాం. అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నాగార్జునగారు నన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటారు. శైలేష్ తో 'హిట్ 4' చేస్తున్నాను. కల్యాణ్ శంకర్‌తో మంచి ఎంటర్టైనర్ ఉంది. ఆల్రెడీ మొదలు పెట్టిన 'మార్షల్' 50 శాతం పూర్తయింది. మంచి కథ కుదిరితే అన్నయ్య సూర్యతోనూ మూవీ చేయాలని ఉంది' అని చెప్పారు. 'సత్యం సుందరం' చిత్రానికి నేషనల్ అవార్డు రానప్పుడు బాధపడ్డారా? అని ప్రశ్నించగా, అంతకన్నా ముందు ఆ సినిమా థియేటర్లలో ఆడనందుకు బాధగా అనిపించిందని సమాధానమిచ్చారు.

Updated Date - Sep 07 , 2026 | 07:30 AM