సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తల్లి కాబోతున్న సమంత..

ABN, Publish Date - Jun 17 , 2026 | 03:06 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతేడాది రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ని వివాహమాడిన సమంత త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతేడాది రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ని వివాహమాడిన సమంత త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సామ్ తల్లి కాబోతుందని టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు.


ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి నాలుగేళ్ల దాంపత్యంలో ఎన్నోసార్లు ఆమె తల్లి కాబోతుందని వార్తలు వినిపించాయి. కానీ, అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. కొన్ని విభేధాల వలన చై- సామ్ విడిపోయారు. అనంతరం సమంత ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యింది. మయోసైటీస్ వ్యాధితో పోరాడి గెలిచింది. ఆ సమయంలో ఆమెకు తోడుగా నిలిచినవారిలో రాజ్ నిడిమోరు ఒకరు. ఇక వీరిద్దరి రిలేషన్ గురించి కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. అవన్నీ దాటుకొని గతేడాది ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.


రాజ్ తో వివాహం తరువాత సామ్ లో కొత్త మార్పును అభిమానులు గమనించారు. ఇక ఇప్పుడు సమంత.. తల్లి కూడా కాబోతుండడంతో మరింత సంతోషిస్తున్నారు. సామ్ జీవితంలోకి కొత్త వెలుగు రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ నటించిన మా ఇంటి బంగారం సినిమా జూన్ 19 న రిలీజ్ కానుంది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజ్ నిర్మించాడు. ఈ సినిమా తరువాత సామ్ నటించడం ఆపేస్తోందని, కేవలం నిర్మాతగానే కొనసాగనుందని సమాచారం. త్వరలోనే ఈ గుడ్ న్యూస్ ని రాజ్ - సామ్ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి తల్లిగా సామ్ కొత్త బాధ్యతలను ఎలా స్వీకరించనుందో చూడాలి.

Updated Date - Jun 17 , 2026 | 04:30 PM