'మిరాకిల్' సృష్టించడానికి రెడీ అవుతున్న హెబ్బాపటేల్!
ABN, Publish Date - Feb 19 , 2026 | 03:09 PM
ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'మిరాకిల్'. ఈ సినిమా మూడో షెడ్యూల్‌లో హీరోయిన్ హెబ్బా పటేల్ పాల్గొనబోతోంది.
గతంలో 'సత్యా గ్యాంగ్, ఫైటర్ శివ' చిత్రాలను రూపొందించిన దర్శకుడు ప్రభాస్ నిమ్మల (Prabhas Nimmala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'మిరాకిల్' (Miracle). రమేశ్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చంద్రగౌడ్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ (Hebba Patel) హీరోయిన్‌గా నటించబోతోంది. ఫిబ్రవరి 24న హైదరాబాద్ పరిసరాల్లో ప్రారంభమయ్యే మూడో షెడ్యూల్‌లో హెబ్బా పటేల్ పాల్గొంటారని మేకర్స్ తెలిపారు.
రణధీర్ బీసు హీరోగా నటిస్తున్న 'మిరాకిల్' చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'సినిమా సంతృప్తి కరంగా వస్తోంది. హెబ్బా పటేల్ గ్లామర్, హీరోపై చిత్రీకరించిన యాక్షన్ బ్లాక్స్, సీనియర్ నటుల నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి' అని తెలిపారు.
సీనియర్ నటులు శ్రీరామ్, సురేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్‌గా పరిచయం అవుతున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.