సంక్రాంతికి వచ్చేది వీరాధివీరులంట
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:33 PM
ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొంచెం తగ్గింది. ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh), కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే.
ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొంచెం తగ్గింది. ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh), కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు పోటీగా దిల్ రాజు మరో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోకి తీసుకురాబోతున్నాడు. తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోన్న హీరోలు రవితేజ(Raviteja), శ్రీవిష్ణు(Sreevishnu) కాంబినేషన్‌లో ఈ కొత్త మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
మెంటల్ మదిలో, రాజరాజచోర, స్వాగ్ సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి వీరాధివీరులంట అనే ఆసక్తికరమైన టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అనిల్ రావిపూడి సినిమాతో పాటు ఈ చిత్రాన్ని కూడా పక్కాగా సంక్రాంతికే థియేటర్లలోకి తీసుకురావాలనే గట్టి టార్గెట్‌తో దిల్ రాజు ఉన్నాడట.
ఇక షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా మేకర్స్ చాలా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్ నాటికల్లా ఫస్ట్ కాపీని సిద్ధం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దీనికి రవితేజ, శ్రీవిష్ణు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ ఇద్దరు హీరోల కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. అలాంటిది ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అరాచకం అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో దిల్ రాజు.. అనిల్ రావిపూడిని ఢీ కొడతాడా లేదా అనేది చూడాలి.