Harudu: 'హరుడు' కోసం నిర్మాతగా మారిన వెంకట్!

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:45 PM

వెంకట్ హీరోగా నటించి, నిర్మించిన సినిమా 'హరుడు'. ఈ సినిమాతో శ్రీహరి పైలా విలన్‌గా పరిచయం అవుతున్నాడు. మే 8న మూవీ రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Venkat

'శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమకోసం, శివరామరాజు' వంటి చిత్రాలలో నటించిన వెంకట్‌ హీరోగా కమ్ బ్యాక్‌ ఇస్తున్నారు. ఆయన తాజా చిత్రం 'హరుడు'ను రాజ్ తాళ్ళూరి డైరెక్ట్ చేస్తుండగా, వి.ఆర్. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.


ఈ కార్యక్రమంలో హీరో వెంకట్‌ మాట్లాడుతూ, ' ‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మీడియా మిత్రులని కోరుతున్నాను. చాలా మంచి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో విలన్‌గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్ట్‌ను పరిచయం చేస్తున్నాం. రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న మ్యూజిక్ అందించారు. ఒక రొమాంటిక్ సాంగ్‌ను గోవాలో షూట్ చేశాం. ఆ పాట చాలా బాగా వచ్చింది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మంచి బడ్జెట్‌తో, మంచి లొకేషన్స్‌లో సాంగ్స్ తీశాం. మా డిఓపీ ఆనంద్ చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్' అని అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ, 'ఇది పూర్తిగా టీమ్ వర్క్. ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ముంబైలో ఐదు రోజుల షూటింగ్ చాలా మంచి అనుభవం. హెబ్బాపటేల్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌, చంద్రమహేశ్‌, మణి జిన్న, డీఓపీ ఆనంద్‌, లత, వేద్విక, అలీ తదితరులు మాట్లాడారు.

WhatsApp Image 2026-04-11 at 3.48.52 PM.jpeg

Updated Date - Apr 11 , 2026 | 04:51 PM