సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘బ్యాండ్‌ మేళం’.. గ్లింప్స్ విడుద‌ల‌

ABN, Publish Date - Feb 15 , 2026 | 05:56 AM

సతీష్‌ జవ్వాజి దర్శకత్వంలో హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్‌ మేళం’.

Band Melam

సతీష్‌ జవ్వాజి దర్శకత్వంలో హర్ష్‌ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్‌ మేళం’ (Band Melam). కోన వెంకట్‌ దీనిని నిర్మించారు. మార్చి 13న విడుదల కానుంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేసి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కోన వెంకట్ (Kona Venkat) మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడే నాకు రోషన్‌, శ్రీదేవి అయితే బావుంటుందని అనిపించింది. నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమాగా బ్యాండ్‌ మేళం నిలుస్తుంది’ అని చెప్పారు. ‘విజయ్‌ బుల్గానిన్ (Vijai Bulganin) మంచి ఆల్బమ్‌ ఇచ్చారు, అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులను సినిమా అలరిస్తుంది’ అని సతీష్‌ జవ్వాజి’ (Sathish Javvaji) అన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:49 AM