పవన్‌ను కలిసిన హరీశ్ బృందం.. ఆకట్టుకుంటున్న వీడియో
ABN, Publish Date - Feb 17 , 2026 | 10:07 AM
హరీశ్ శంకర్ తన బృందంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్‌ను కలిశారు.
‘మహాశివరాత్రి సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అప్‌డేట్ అడుగుతున్న వాళ్లు రెడీగా ఉండండి.. సర్‌ప్రైజ్ రాబోతోంది’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన చెప్పినట్లుగానే ఈ సినిమాలో రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ‘పవర్‌స్టార్ ఆరా ఇన్ పవర్‌ఫుల్ అంథమ్’ అంటూ సెకండ్ సింగిల్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌తో వెల్లడించారు. అంతే కాదు.. ఈ పోస్టర్‌తో కొన్ని లైన్స్ కూడా రాశారు..
‘మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు..
బండ రాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
ఏ తరమైనా నీ తరమే..
మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే’
అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పోస్ట్ చేసింది. ఇవి ఆరా పాటకు సంబంధించిన లిరిక్స్ అని తెలుస్తోంది.
ఇది కాకుండా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హరీశ్ శంకర్ తన బృందంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్‌ను కలిశారు. అందులో పవన్, హరీశ్ జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ ఎంతో సరదాగా కనిపించారు. హరీశ్ ఏదో అనగా పవన్ ఆయన్ను భుజం మీద కొట్టారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘ఇది కదా హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ మధ్య ఉన్న బాండింగ్’ అంటూ కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ‘తన ఆధిపత్యశైలిలో బంగారంలాంటి రోజుల్ని మళ్లీ వెనక్కి తీసుకొస్తున్నాం’ అని హరీశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత 14 ఏళ్లకు వీరిద్దరి కాంబోలో సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.