సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హరీశ్‌ శంకర్‌ : గుండె లోపల.. గుండె పైనా.. నా గుండె ధైర్యం పవన్‌కల్యాణే..

ABN, Publish Date - Mar 15 , 2026 | 10:46 PM

'పవన్‌కల్యాణ్‌గారితో 'కెవ్వుకేక’ లాంటి సాంగ్‌ చేయలేని పరిస్థితి ఇప్పుడు. అలాంటి పాట లేదు కాబట్టే అభిమానులు కోరుకునే డాన్స్‌తో 'దేఖ్‌లేంగే సాలా’ సాంగ్‌ చేయించా. తెరపై దానిని చాలా ఎంజాయ్‌ చేస్తారు’ అని హరీశ్‌ శంకర్‌ అన్నారు.

'పవన్‌కల్యాణ్‌గారితో 'కెవ్వుకేక’ లాంటి సాంగ్‌ చేయలేని పరిస్థితి ఇప్పుడు. అలాంటి పాట లేదు కాబట్టే అభిమానులు కోరుకునే డాన్స్‌తో 'దేఖ్‌లేంగే సాలా’ సాంగ్‌ చేయించా. తెరపై దానిని చాలా ఎంజాయ్‌ చేస్తారు’ అని హరీశ్‌ శంకర్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో వహించిన చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో జరిగింది. హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ 'సినిమా చాలా లేట్‌ అయుంది. అనుకున్న కథ వేరు.. ఇప్పుడు తెరపైకి వస్తున్నది వేరు.  మొదటకాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'ఖుషి’ సినిమా క్యారెక్టర్స్‌కు కొనసాగింపుగా ఓ కథతో మొదలయ్యాం. కానీ నేను అనుకున్న హీరోయిజం, స్పేస్‌, ఫన్‌ రాకపోవడంతో కథ మారింది. ఈ సినిమా అప్పుడు లేట్‌ అవ్వడానికి.. ఇప్పుడు ఇంత త్వరగా పూర్తి కావడానికి నేనే కారణం. నిర్మాతలు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. త్వరగా పూర్తి చేయమని ఏ రోజు అడగలేదు. ప్రతి డైరెక్టర్‌కి డ్రీమ్‌ ప్రొడ్యుసర్స్‌ వీరు. అలాగే రైటింగ్‌ టీమ్‌ ఎంతో కృషి చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ కాలర్‌ ఎగరేసే సంగీతం ఇచ్చారు. ఒక్క సినిమా రిలీజ్‌ అగింది అనగానే అన్ని ఏరియాల బయ్యార్లు మా అందరికీ ఫోన్‌ చేశారు. సినిమాను వారం ముందుకు తీసుకురమ్మని కోరారు. అందరి కోరికతో సినిమాను ఈనెల 19న సినిమాను తీసుకొస్తున్నాం. ఈ ఉగాది ఉస్తాద్‌ ఉగాది రాసుకోండి’ అని అన్నారు.


పరిగెత్తారు.. పరుగులు తీయించారు..

కొన్నాళ్ల క్రితం సరైన సక్సెస్‌ లేక చాలా కష్టాల్లో, బాధల్లో ఉండగా ఏంటి పరిస్థితి అని ఆలోచనలో ఉండగా నా దేవుడు పవన్‌కల్యాణ్‌ శ్రీహరిలా నన్ను ఆదుకున్నారు. ఆయన నుంచి పిలుపొచ్చింది. షూటింగ్‌ ప్లాన్‌ చేసుకో.. సినిమా పూర్తి చేసేద్దాం అని తాను పరిగెత్తారు.. మమ్మల్ని పరుగులు పెట్టించారు. నిజంగా నేను డల్‌గా ఉన్న సమయంలో నాకు ఊపిరిపోశారు. అందుకే నా గుండె లోపల.. గుండె పైనా.. నా గుండె ధైర్యం పవన్‌కల్యాణ్‌ అని చెబుతా. గబ్బర్‌సింగ్‌ సమయంలో కంటెంట్‌...ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అని రాశా. కానీ ఈ సినిమాకు పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన కమిట్‌మెంట్‌కు ుకమిట్‌మెంట్‌ ఉన్నోడికే కటౌట్‌ ఉంటుంది’ అనిపించింది. ఆ డైలాగ్‌ను ఇప్పుడు మార్చుతున్నా’ అని అన్నారు. 

Updated Date - Mar 15 , 2026 | 10:49 PM