సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పొలిటికల్‌ డైలాగ్‌లు.. సెటైర్లు ఉండవు.. హరీశ్‌శంకర్‌ క్లారిటీ..

ABN, Publish Date - Feb 23 , 2026 | 07:45 PM

సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ హవానే నడుస్తోంది. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం నుంచి చిత్ర బృందం ఆదివారం ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ పేరుతో రెండో పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. దీనికి వస్తోన్న స్పందన గురించి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఓ వీడియో ద్వారా తెలిపారు.

సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ హవానే నడుస్తోంది. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh)చిత్రం నుంచి చిత్ర బృందం ఆదివారం ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ పేరుతో రెండో పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. దీనికి వస్తోన్న స్పందన గురించి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఓ వీడియో ద్వారా తెలిపారు. పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ చిత్రంలో ఎలాంటి పొలిటికల్‌ డైలాగ్‌లు ఉండవని, ఏ వ్యక్తిని, పార్టీని, వర్గాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా సినిమా ఉండదని స్పష్టం చేశారు. అందరూ చూసే సినిమా ఇదని తెలిపారు. హీరోని ఎలివేట్‌ చేసే మాటలు, ఆయన పెర్‌ఫార్మెన్స్‌ బద్దలైపోతుందని క్లారిటీగా చెప్పారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ పాటలోని లిరిక్స్‌ కట్‌ చేసి ఎడిట్‌ చేసి పంపిస్తుంటే  ఆనందంగా ఉంది. పాటలో రిథమ్‌ స్టార్ట్‌ కాగానే పవన్‌కల్యాణ్‌ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయామని ఫ్రెండ్‌ ఒకతను కాల్‌ చేసి చెప్పాడు. ఇంతకుముందు పాటకు ‘డాన్స్‌ బస్టర్‌’ అని పేరు పెట్టారు. ఈ పాటకు ‘ట్రాన్స్‌బస్టర్‌’ అని పెట్టండని చెబుతున్నారు. ఈ పాట పవన్‌కల్యాణ్‌గారి వ్యక్తిత్వానికి, యాటిట్యూడ్‌కి దగ్గరగా ఉండడంతో చాలామంది ఇందులో పొలిటికల్‌ డైలాగ్‌లు, రిఫరెన్స్‌లు ఉంటాయా? అనడిగారు. ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నా. ‘సినిమాను సినిమాలాగా చూడండి.. రాజకీయాన్ని వేరుగా చూడండి’ అని సినిమా ప్రారంభమైన రోజునే పవన్‌ మాకు చెప్పారు. అది ఆయన సిద్ధాంతం. అదే పాలో అవుతున్నారు. సిద్దాంత పరంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రకాశ్‌రాజ్‌తో ఆయన 'వకీల్‌సాబ్‌, ఓజీ' చిత్రాలు చేశారు. ఆయన పాలసీ పరమైన పోరాటం చేస్తారు కానీ.. ఎవరినీ టార్గెట్‌ చేయరు.

'సినిమాలో డైలాగ్‌లు, రిఫరెన్సులు, సన్నివేశాలు ఏ వ్యక్తిని చిన్నబుచ్చుకునేలా చేసినా అది సినిమాపై ప్రభావం చూపుతుంది. అలాంటివి ఏమీ చేయొద్దు. సినిమాను సినిమాలాగే చేద్దాం' అని పవన్‌ ముందే చెప్పారు. ఇందులో గాజు డైలాగ్‌ ఉందంటే.. గాజు పగిలితే పదును ఎక్కువ ఉంటుంది. కాబట్టి హీరో ఎలివేషన్‌ కోసం పెట్టింది తప్ప ఇంకొకరిని తక్కువ చేయడం కోసం కాదు, సెటైర్లు వేయడం కోసం కాదు. అలాంటివి ఇందులో ఉండవు. ఓట్లు ఎవరికి వేసినా పవన్‌కల్యాణ్‌ను అభిమానించేవారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. మనం పొలిటికల్‌ డైలాగ్‌లు సినిమా పెట్టొద్దని అభిమానులే చెప్పారు. పవన్‌ కల్యాణ్‌గారి సిద్ధాంతాలను ఫాలో అవుతున్న అభిమానులకు అభినందనలు. ఇందులో ఎలాంటి పొలిటికల్‌ డైలాగులు, సెటైర్లు ఉండవు’ అని వివరణ ఇచ్చారు హరీశ్‌ శంకర్‌. ఇందులో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Feb 24 , 2026 | 11:13 AM